చిత్రం: పెళ్లి పందిరి(1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలసుబ్రహ్మణ్యం, మనో
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం ||2|
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం
ఆహాహా ఆహా ఎహేహే ఎహే
నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం
ఓహోహో ఓహో ఆహాహా ఆహా
హే వేరల్లే నేనొదిగుంటా
నువు ఎదుగుతూ ఉంటే
మబ్బుల్తో మన కథ చెబుతా
వింతగ వింటుంటే
నీలానాలా సావాసంగా నింగీనేల కలవాలంటు
మబ్బై కరిగి ఇలపై జల్లైరాదా
మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
ఆహాహా ఆహా ఓహోహో ఓహో
ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది
ఓహోహో ఓహో హేహేహే హేహే
హే ప్రాణానికి ప్రాణంపోసే
మంత్రం రా స్నేహం
స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం
ఊరూవాడా ఔరా అంటూ
ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే
రాదా నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి