Pelli Pandiri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pelli Pandiri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2021, మంగళవారం

Pelli Pandiri : Anaanaga Oka Nendu Song Lyrics (అనగనగ ఒక నిండు చందమామ)

చిత్రం: పెళ్లి పందిరి(1997)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర




అనగనగ  ఒక  నిండు  చందమామ నీరు  పేద  కలువతో  చెలిమి  చేసెనమ్మా అంతలోనే  తెలవారిపోయెనమ్మ ఆ  కన్నె  కలువ  కల  కరిగి  పోయెనమ్మ పచ్చని  జంటను  విడదీసిన  ఆ  పాపం  ఎవ్వరిదీ పచ్చని  జంటను  విడదీసిన  ఆ  పాపం  ఎవ్వరిదీ కథ  మొదలవగానే  కాలం   కత్తులు  దూసింది కథ  మొదలవగానే  కాలం  కత్తులు  దూసింది ఓ ఓ ఓ ....... అనగనగ  ఒక  నిండు  చందమామ నీరు  పేద  కలువతో  చెలిమి  చేసెనమ్మా ఆశలెన్నో  విరిసేలా  బాసలెన్నో  చేసాడు ఉన్నపాటుగా  కన్ను  మరుగయే  చలువ  చంద్రుడు ఆశలెన్నో  విరిసేలా బాసలెన్నో చేసాడు ఉన్నపాటుగ కన్ను   మరుగయే  చలువ  చంద్రుడు రేరాజును  రాహువు  మింగాడో అమావాస్యకి  ఆహుతి  అయ్యాడో రేరాజును  రాహువు  మింగాడో అమావాస్యకి  ఆహుతి  అయ్యాడో అటు  ఇటు  వెతుకుతూ  నిలువునా  రగులుతు వెన్నెల  ఉందని  వేకువ  వద్దని  కలువ  జన్మ  వడలి  పోయెనమ్మ ఆ ఆ ఆ ......... అనగనగ  ఒక  నిండు  చందమామ నీరు  పేద  కలువతో  చెలిమి  చేసెనమ్మా గుప్పెడంత  గుండెల్లో  ఉప్పెనైనా  సంద్రంలో చిక్కుకున్న  ఈ  చిన్న  ఆశకి  శ్వాస  ఆడదే దిక్కులన్నీ  చూస్తున్న  నింగిని  నిలదీస్తున్న దిక్కులేని  ఈ  దిగులు  ప్రశ్నకి  బదులు  దొరకదే చిరునవ్వులు  పూసిన  మంట  ఇదీ కన్నీటిని  కోరని  కోత  ఇది చిరునవ్వులు  పూసిన  మంట  ఇదీ కన్నీటిని  కోరని  కోత  ఇది ఓటమై  ముగిసిన  గెలుపుగా  మిగిలిన జాబిలి  వెన్నెల  మాటున  రేగిన  జ్వాలలాంటి  వింత  బతుకు  నాది ఆ ఆ ఆ .... ఓ ఓ ఓ ... కలువని  చంద్రుని ఎందుకు  కలిపాడు ఆ  కలయిక  కలగా  ఎందుకు  మార్చాడు ఆ  కథ  రాసిన  దేవుడన్నవాడు కరునన్నది  ఎరుగని  కటిక  గుండెవాడు నా కథలో  ఆ  దేవుడే  ఎంతటి  దయ  చూపించాడు అడగక  ముందే  ఇంతటి  పెన్నిధి  నాకందించాడు కలలే  తరగని  ఈ  చంద్రుని  నేస్తం  చేసాడు ఎపుడు  వాడని  ఈ  కలువని  చెలిగా  ఇచ్చాడు ఓ ఓ ఓ  ఓ .........

3, జులై 2021, శనివారం

Pelli Pandiri : Dost Mera Dost Song Lyrics (దోస్త్ మేరా దోస్త్ )

చిత్రం: పెళ్లి పందిరి(1997)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: భువనచంద్ర

గానం: బాలసుబ్రహ్మణ్యం, మనో


దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం

బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం

స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం ||2|

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం



నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం

ఆహాహా ఆహా ఎహేహే ఎహే

నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం

ఓహోహో ఓహో ఆహాహా ఆహా

హే వేరల్లే నేనొదిగుంటా

నువు ఎదుగుతూ ఉంటే

మబ్బుల్తో మన కథ చెబుతా

వింతగ వింటుంటే

నీలానాలా సావాసంగా నింగీనేల కలవాలంటు

మబ్బై కరిగి ఇలపై జల్లైరాదా

మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం

బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం

స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం


చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది

ఆహాహా ఆహా ఓహోహో ఓహో

ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది

ఓహోహో ఓహో హేహేహే హేహే

హే ప్రాణానికి ప్రాణంపోసే

మంత్రం రా స్నేహం

స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం

ఊరూవాడా ఔరా అంటూ

ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే

రాదా నేస్తం కాలం చదవని కావ్యం

లోకం మొత్తం చదివే ఆరో వేదం


దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం

బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం

స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం 

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం

Pelli Pandiri : Nesthama Iddari Song Lyrics (నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా )

చిత్రం: పెళ్లి పందిరి(1997)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం, గోపిక పూర్ణిమ


మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం

నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు

ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా


నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే

ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే

చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే


నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా


మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్ అవి ఎలా ఉంటాయ్

బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది

పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది

నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా

దిగులు రంగే హా హా నలుపు అనుకో హా హా

ప్రేమ పొంగే హా హా పసుపు అనుకో హా

భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే

చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే


నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా


ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయ్

మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలిక ఉదయం అనుకోమ్మా

చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా

నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే

ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా

కలువ నీవే హా హా శశిని నేనే హా

ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే

చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే


నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే

ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే

చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే