చిత్రం : పెళ్లి సందడి
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ పల్లవి: మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందనీ బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడనీ అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే యస్ యు ఆర్ మై డ్రీం గార్ల్ నా కలల రాణి నా కళ్ళముందుంది అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం ఈ కలయిక ఇలాగే ఉండాలి Promise.....Promise చరణం:1
నిన్ను చూడందే పదే పదే పడే యాతన తోట పూలన్నీ కనీ వినీ పడేను వేదన నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకనీ అంటూ... మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే చరణం:2
పెళ్ళి చూపుల్లో నిలేసిన కథేమిటో మరి జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వనీ సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు ఎదటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి