Pelli Sandadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pelli Sandadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, డిసెంబర్ 2021, శుక్రవారం

Pelli Sandadi : Chikkaledu Chinnadani Song Lyrics (చిక్కలేదు చిన్నదాని ఆచూకి)

చిత్రం : పెళ్లి సందడి (1996)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి

గానం: మనో , ఎం. ఎం. కీరవాణి 



బిక్కుబిక్కుమంటు వంట ఇంట నక్కాము లక్కు మాకు దక్కునంటు ఇక్కడొచ్చి పడ్డాము కొంటెదాని జాడ లేక గరిట చేతపట్టాము పిట్ట నేడు కానరాక పిండి రుబ్బుతున్నాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి దప్పలాలు గుప్పుమంటు గొప్పగుంది మావంట అప్పడాలు చేయకుండ తప్పలేదు ఈపూట మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు పెరుగు పచ్చడి పులిహోర పొంగలి సాపాటు రెప్పపాటులో రెడీ నాభి సుందరి నాలోని ఊపిరి వరించి చేరుటెప్పుడో ఒడి స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము రొస్టులోన తేస్టులెన్నొ రెస్టులేక నింపినాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి హ చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి చిటెకలోనె సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా గుటకలోన కరిగిపోవు గులాబ్జాము ఈపక్క పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా నేతి బూరెలు లేలేత గారెలు భలేగ కొలువుతీరి ఉన్నవి పూతరేకులు కచోరి అరిసెలు ఊరించి రుచులు పెంచుతున్నవి మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

Pelli Sandadi : Ramya Krishna Laga Song Lyrics ( రమ్యకృష్ణలాగ ఉంటదా)

చిత్రం : పెళ్లి సందడి (1996)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: జొన్నవిత్తుల

గానం: మనో , ఎం. ఎం. కీరవాణి


నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్ళిచేసే బాధ్యత నాది ఓరి బామ్మర్ది నీ కలలోకొచ్చిన చిన్నదీ ఈ ఈ ఎవరది ఎలాగుంటది రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగ రంజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న ఇంద్రజ ఆమని లుక్కు ఉందా శోభన గౌతమి షేపు ఉందా చెప్పకుంటె దాని జాడ ఎట్ట తెలుసుకోమురా రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీదీక్షితా వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీచావ్లానా అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా అరె కుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల కుష్బునా నీ మగసిరి మెచ్చుకుంది మమతాకులకర్ణా నీ టాపు లేపింది టాబునా శిల్పాశెట్టి లాంటి చిలక భామా శ్రీదేవి లాంటి చందమామా హే హే హే మోహిని రూపిణి రేవతినా చెప్పరా నాయనా ప్రియారామనా ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్ళిడోలు రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగ రంజుగుంటదా ఆ చెప్పర కన్నా చెప్పర నాన్న కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజానా శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా బెల్లంముక్కలాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా యువకులకి పులకరింత పూజాభట్టేనా రవ్వలడ్డులాంటి పిల్ల మాలాశ్రీయా దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీయా మనీషా కొయిరాల పోలికలోన అహ మతిపోయే మధుబాల మాదిరి జాణ హే హే హే అంజలి రంజని శుభశ్రీయా ఊర్వశీ కల్పన ఊహలానా హింటు ఇస్తె చాలు మాకు జంట నీకు చేస్తాము రమ్యకృష్ణలాగ ఉంటదా అబ్బ చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగ రంజుగుంటదా హే చెప్పర కన్నా చెప్పరా నాన్న చెప్పమ్మా

2, ఆగస్టు 2021, సోమవారం

Pelli Sandadi : Soundarya Lahari Song Lyrics (సౌందర్యలహరి స్వప్నసుందరి)

చిత్రం : పెళ్లి సందడి

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి: సౌందర్యలహరి సౌందర్యలహరి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కల నుంచి ఇలచేరి కనిపించు ఓసారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి చరణం:1 పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు అదిరేటి అధరాలు హరివిల్లులు పక్కున చిందిన నవ్వులలో ఆ....ఆ.... లెక్కకు అందని రతనాలు ఆ....ఆ..... యతికైనా మతిపోయే ప్రతి భంగిమ ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి చరణం:2 నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్లు నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్లు నను చూసి వలవేసి మెలివేయగా ఊసులు చెప్పిన గుసగుసలు ఆ.....ఆ..... శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ....ఆ..... కలగంటి తెలుగింటి కలకంటిని కొలువుంటే చాలంట నా కంట సుకుమారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

Pelli Sandadi : Chemma Chekka Song Lyrics (చెమ్మచెక్క చారడేసి మొగ్గ)

చిత్రం : పెళ్లి సందడి

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి పరువానికి పరువైన యువతి వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి మనసిచ్చిన మరుమల్లికి మరిది దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం పెదవిచాటు కవిత మన ప్రేమాయణం వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం అందమారబెట్టే అద్దాల చీరకట్టే తడి ఆరిన బిడియాల తరుణి మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి మగసిరిగల దొరతనమెవరిదనీ బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ