1, జులై 2021, గురువారం

Pokiri : Gala Gala Parutunna Song Lyrics (గల గల పారుతున్న గోదారిలా)

చిత్రం: పోకిరి(2006)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: కందికొండ

గానం: నిహాల్



గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా

నాకెందుకో ఉన్నది హాయిగా

నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా

నాకెందుకో ఉన్నది హాయిగా

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా


వయ్యారి వానలా వాన నీటిలా ధారగా

వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా

మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా

పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన

ఊ...ఓ...ఈ అల్లరి ఊ...ఓ...

ఊ...ఓ...బాగున్నది ఊ...ఓ...

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా


చామంతి రూపమా తాళలేవుమా రాకుమా

ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా

హిందోళరాగమా మేళతాళమా గీతమా

కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా

ఊ...ఓ...ఈ లాహిరి ఊ...ఓ...

ఊ...ఓ...నీ ప్రేమది ఊ...ఓ...

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి