21, జులై 2021, బుధవారం

Raghavan : anam Vesade Song Lyrics (బాణం వేశాడే)

చిత్రం:రాఘవన్(2007)

సంగీతం:హర్రిస్ జయరాజ్

సాహిత్యం: వేటూరి

గానం: శ్రీ హరీష్ రాఘవేంద్ర,బొంబాయి జయశ్రీ



బాణం వేశాడే పువ్వుల బాణం వేశాడే నేను విరిసానే ఒళ్ళే నేను మరిచానే ఓ అలలో చిక్కి నేను తడిశా కడలై పొంగి పొరలితినే సుస్వరాల వీణను మీటిన మదనుడు బాణం వేశాడే ఆశ తెలిసిందే కన్నె ఆశ తెలిసిందే (2) ఈ కనులై విరిసే కలువలలో పున్నమి వెన్నెల కురిసిందే అంబరాలు విడిచిన చినుకులు చిలికెను నేడు జడివానై సూరీడొస్తే నా కన్నులను తెరచి ఊరించేది నీ మొఖమే కునుకే తీసిన కనులే చూసినవి స్వప్నాల మెరిసె నీ మొఖమే నను పట్టి నాలో తెలియంది తెలిపే నీ అడుగుజాడల నడిచే నీకున్న సరదాలు నా కన్ను తెలిపే అవి తీరు వైనం నన్ను కుదిపే వీడ్కోలు పలికే విడలేని మనసే నిలిచెను నా కంటి వెలుగై నన్నొదిలి నువ్వెళ్ళి నే తల్లడిల్లె వాకిళ్ళ నను చూసి నవ్వుతావు వాకిళ్ళ నను చూసి నవ్వుతావు ఆశ తెలిసిందే కన్నె ఆశ తెలిసిందే (2) ఓ అలలో చిక్కి నేను తడిశా కడలై పొంగి పొరలితినే అంబరాలు విడిచిన చినుకులు చిలికెను నేడు జడివానై నవ్వే నీ మొఖం నే కన్న కలలు సిరులిచ్చి కొనలేను చెలియా నువ్వే ఎదురుగా నిలిచే క్షణాల్లో కల వచ్చెననుకున్నానే సఖియా ఎకాంతాల ఒడి నీ గుండె గూటిలో సిరిమల్లె అల్లె పొదరిల్లు కొమ్మా రెమ్మా చిగురించే చైత్రమే రాయాలి మన ప్రేమ కావ్యం కను రెప్ప మూస్తే కలలోన నీవే కనుపాప తెర మీద నీవే కడ దాక విడలేని కలకాని మౌనం సరిజోడు నా తోడు నీవే సరిజోడు నా తోడు నీవే బాణం వేశాడే పువ్వుల బాణం వేశాడే నేను విరిసానే ఒళ్ళే నేను మరిచానే ఓ అలలో చిక్కి నేను తడిశా కడలై పొంగి పొరలితినే సుస్వరాల వీణను మీటిన మదనుడు బాణం వేశాడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి