7, జులై 2021, బుధవారం

Raja Kumarudu : Indurudo Chandurudo Song Lyrics (ఇందురుడో చందురుడో మావ)

చిత్రం : రాజ కుమారుడు(1999)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా


ఇందురుడో చందురుడో మావ

హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా

యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మ


ముద్దులకు వద్దులకు వుండు చలాకి

మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి

వంటి చలి తీరుటకే జంటగమారి

ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం

సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం


ఇందురుడో చందురుడో మావ

హోల్ ఆంధ్రాకే నచ్చదమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మ


చుక్కలలో చక్కదనం దాచిన దాన

ఎలాగైనా లాగెయ్ నా ఏదో చెయ్ నా దోచెయ్ నా

కన్నులతో కన్నెరికం తీర్చినవాడా

భలే వాడా నీ మీదా అదే లేరా చిన్నోడా

నాతి చరామి ఇదే రాతిరి హామీ

చల్లని సామి సదా నిన్ను స్మరామి

పక్కలుగా పరుచుకునే పదహారేళ్ళు

మక్కువగా లెక్కడిగే మంచం కోళ్ళు


యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మ


యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

కోరికలా కోటలనే కట్టిన రాజా

ఇదే పూజా రేయ్ రాజా మహా తేజా నా రాజా

పైటలలో పాటలెన్నో దాచిన దానా

శృతే చెయ్ నా నీ వీణా

చలో జాన తిల్లనా

పట్టు పదామి పడితే పక్కకు లాగి

కన్నె గులాబి భలే కౌగిలి బేబీ

.. జరుపుకునే కధ నూరేళ్ళు

హెయ్ ఇద్దరమే కలుసుకున్న ఎద కొన్నేళ్ళు


యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మ


ముద్దులకు వద్దులకు వుండు చలాకి

మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి

వంటి చలి తీరుటకే జంటగమారి

ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం

సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి