చిత్రం : రాజ కుమారుడు(1999)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సుఖ్విందర్ సింగ్, చిత్ర
రామ సక్కనోడమ్మ చందమామ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొ రామ
కల్లోకి వచ్చినట్టు మేనమావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
అత్తకొడుకా అని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తి లాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అద్దుకోవె
ఆ మీద చిటికెనేలు అందుకోవే
రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
హొ హొ హొ హొ హొ
రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
ఒహొ హొ
కొప్పులో పువ్వుల రేకు రాలకుండనే
చెంపలో ముద్దులు నింపుతానులే
చేతులా గాజులా సద్దు చేయకుండనె
ముద్దుతో కౌగిలి ముట్టచెప్తలె
హెయ్ నిన్నూ నన్నూ చూస్తావుంటే
నోరూరుతుందే వూరోళ్ళకు
జడ తోటి మంచిగా దిష్టి తీసి
పెట్టుకుంట నీకు నేను పైట చాటు
యాదగిరి గుట్ట మీద ఒట్టు పెట్టు
రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
హొ హొ హొ హొ హొ హొ హొ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
మావిడి సెట్టులా వుంట వమ్మ ఎప్పుడు
అందనే అందవూ పొందడానికి
పక్కనే సక్కని నిచ్చనుంది చూసుకో
పండినా కొమ్మను వంచడానికి
సింగమోలే నేను వస్తే
సిగ్గు పల్లకిలో చోటిస్తావా
పట్టు తేనెలు ఇచ్చుకోనా
గుత్తి మీద జున్ను పాలు కాయకుండా
చల్ల కొచ్చి ముంత నువ్వు దాయకుండా
రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
హ హ హ హ
రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
అత్తకొడుకా అని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తి లాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అద్దుకోవె
ఆ మీద చిటికెనేలు అందుకోవే
ఓయ్ రామ సక్కనోడమ్మ చందమామ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరామ
హెయ్ హెయ్ హెయ్