21, జులై 2021, బుధవారం

Sri Rama Rajyam : Ramayanamu Song Lyrics (రామాయణము శ్రీ రామాయణము )

చిత్రం: శ్రీ రామ రాజ్యం(2011)

సంగీతం:ఇళయరాజా

సాహిత్యం: జొన్నవిత్తుల

గానం: శ్రేయ ఘోషల్, చిత్ర



రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము  అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానమూ  అనురాగము అనుబంధము అనుపమానమూ  సహనశీల ధీర వీర వరగభీరమూ సహనశీల ధీర వీర వరగభీరమూ రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము  శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం  దశరధుడు చేసే ఆదేశం శ్రీరామ పట్టాభిషేకం  ఉప్పొంగిపోయే ఆ దేశం ఉప్పొంగిపోయే ఆ దేశం  కలవరం తెచ్చింది కైకకిచ్చిన వరం  ఆనలకు పంపమని లేక ఏ కనికరం పదునాలుగేండ్లు శ్రీరాముని వనవాసమును చేయమన్నది  వనవాసమును చేయమన్నది  చెదరని దరహాసం కదిలెడు వనవాసం  చెదరని దరహాసం కదిలెడు వనవాసం  వదిలె రాణి వాసం వచ్చే మగని కోసం  తండ్రీ మాటకోసం కొడుకు తండ్రికోసం  తండ్రీ మాటకోసం కొడుకు తండ్రికోసం  భార్య భగనికోసం లక్ష్మన్న అన్న కోసం  జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం  జగమంతా ఆక్రోశం ఏమయ్యా రామయ్యా ఏమైపోవలయ్యా మేమేమై పోవాలయ్యా ఏమయ్యా రామయ్యా ఏమైపోవలయ్యా మేమేమై పోవాలయ్యా అటు పురజనులు ఇటు దశరధుడు వెక్కి ఏడ్చినారు మొక్కి ఆపినారు  సత్య వచనమై సాగెను రఘుపతి  ధర్మ కవచమై అనుసరించె సతి  లక్ష్మనుడేగెను వినయశీలుడై  అయోధ్య మిగిలెను అమావాస్యయై  అయోధ్య మిగిలెను అమావాస్యయై  రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము  అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానమూ  అనురాగము అనుబంధము అనుపమానమూ  సహనశీల ధీర వీర వరగభీరమూ సహనశీల ధీర వీర వరగభీరమూ రామాయణము శ్రీ రామాయణము రామాయణము రామాయణము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి