Sri Rama Rajyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Rama Rajyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మార్చి 2022, గురువారం

Sri Rama Rajyam : Sita Rama Charitham Song Lyrics (

చిత్రం: శ్రీ రామ రాజ్యం (2011)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: శ్రేయ ఘోషల్, శ్వేత మోహన్

సంగీతం: ఇళయరాజా



సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం చతుర్వేదవినుతం లోకవిదితం ఆదికవి వాల్మికి రచితం సీతరామచరితం కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా  కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగ కడలితల్లికి కనుల పండగ సుందర రాముని మోహించే రావణ సోదరి సూర్పనఖ సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగ తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి అన్న చూడని అక్కసు కక్కుచు రవణు చేరెను రక్కసి దారునముగ మాయ చేసె రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడు  అదను చూసి సీతని అపహరించె రావణుడు  కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి కరకు గుండెలోపాసుల కాపలాగ వుంచి శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరధి సీతా సీతా సీతా సీతా అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోధించే సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం కమలనయనములు మునిగే పొంగేకన్నీటిలో  చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో  చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత సిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చి వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా వానరవేగముగ రామభద్రుడె రావణ తలపడికొట్టెర భుజమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెగా అంత బాధ పడి సీతకోసమని ఇంత చేసె శ్రీరాముడు చెంతచేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష  ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష శ్రీరాముని భార్యకా శీలపరీక్ష  వయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష  జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా  సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవ్వరికీపరిక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అగ్గిలోకి దూకే అవమానముతో సతి అగ్గిలోకి దూకే అవమానముతో సతి నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహొత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటె నేటి శ్రీరాముడు ఆ జానకితో అరణ్యమేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు

Sri Rama Rajyam : Jagadhananda Karaka Song

చిత్రం: శ్రీ రామ రాజ్యం (2011)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్

సంగీతం: ఇళయరాజా



జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా

ఆ అ ఆ జగదానంద కారకా జయ జానకీ

ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ అ ఆ

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక

నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

సార్వభౌమునిగ పూర్నకుంబములె స్వాగతాలు పలికే

రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే

నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే

న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె

రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం

సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం

సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి పరవసించె పొయే

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే

రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే

రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం

రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం

ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక

నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక

జగదానంద కారకా జయ జానకీ

ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా


6, మార్చి 2022, ఆదివారం

Sri Rama Rajyam : Gali Ningi Neeru Bhumi Nippu Meeru Song Lyrics (గాలి నింగి నీరు)

చిత్రం: శ్రీ రామ రాజ్యం (2011)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా



గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరార అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగ పోలేద ఈ రథముని ఆపగలేద విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసివిధి కి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా సుగునంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలిసిందా ఈ జగమే చీకటి అయ్యిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ నీ మాట నీదా వేరే దారేదీ లేదా నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ


Sri Rama Rajyam : Rama Rama Ane Song Lyrics (రామ రామ రామ రామ)

చిత్రం: శ్రీ రామ రాజ్యం (2011)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: శ్వేత మోహన్, అనిత

సంగీతం: ఇళయరాజా



రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాల సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట ఖర్జురాలు, ద్రాక్షలూ ఉడతలకే పెడతడంట దాక్కుంటడంటా, సెట్టు సాటుకెళ్ళీ రాళ్ళేస్తడంటా చెరువులోన మళ్ళీ అమ్మా నాన్నా అంతా ఆ అల్లరి మెచ్చుకుని బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంటా. రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం పాలబువ్వ తినమంటే మేడపైకి పరుగులంట పసిడి బిందె లోని పన్నీరు ఒలకబోస్తడంట సందమామ కావాలని సందెకాడ గొడవంట అద్దములో సూపిస్తే సంచిలోన దాసెనంట శ్రీరాముడైనా చిన్నప్పుడూ ఇంతే ఆకాశమంటే అల్లరి చేసాడంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం అమ్మ నాన్న అన్ని మాకు నువ్వె కాద అమ్మ ఎప్పుడు ఇంకా హద్దులు మీరం తప్పుని మన్నించమ్మా రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాల సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

21, జులై 2021, బుధవారం

Sri Rama Rajyam : Devullemechindhi Song Lyrics (దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది)

చిత్రం: శ్రీ రామ రాజ్యం(2011)

సంగీతం:ఇళయరాజా

సాహిత్యం: జొన్నవిత్తుల

గానం: శ్రేయ ఘోషల్, చిత్ర



ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది  సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ  మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది  సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ  ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ మనసంతా వెలిగించి నిలిపేనిదీ  సరిరాని ఘనులందరి నడిపే కథ ఇదియే  దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది  సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ  అయోధ్యనేలే దశరథ రాజు  అతని కులసతులు గుణవతులు ముంగురు  పుత్రకామ యాగం చేసెను రాజే  రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో  కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు  రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు  రగువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే  దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది  సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ  దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో  కాలమే మరిచెను కౌషికు డేతించెనూ  తన యాగము కాపాడగ రాముని పంపాలని  మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే  రాముడే ధీరుడై తాటకిని చంపే  యాగమే సఫలమై కౌషిక ముని పొంగే  జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే  శివధనువదిగో నవవధువిదిగో  రఘు రాముని తేజం అభయం అదిగదిగో  సుందరవదనం చూసిన మధురం  నగుమౌమున వెలిగే విజయం అదిగదిగో  ధనువును లేపే మోహన రూపం  పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం  పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే  నీ నీడగ సాగునింక జానకీయని  సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ  ఆ స్పర్సకి ఆలపించే అమ్రుత రాగమే  రామాంకితమై హృదయం కలిగే సీతకీ  శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని  ఆజానుబాహుని జతకూడే అవని జాత  ఆనంద రాగమే తానాయే హృదిమి సీత  దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది  సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ