1, జులై 2021, గురువారం

Suswagatham : Suswagatham Navaragama Song Lyrics (సుస్వాగతం నవరాగామా.)

చిత్రం: సుస్వాగతం(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ

గానం: హరిహరన్, చిత్ర, జాస్పిండెర్ నరుల



పల్లవి: సుస్వాగతం నవరాగామా..... పలికిందిలే యదసరిగమ.... ప్రియ దరహాసమా...ప్రేమ ఇతిహాసమా.... నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా.... ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా.. ఆ..ఆ...ఆ... ప ని స గ ని ని స చిన్నారి రాణి పువ్వా.. చిన్ని చిన్ని నవ్వులివ్వా.. నీ కోసం ప్రాణం పెట్టే చిన్నవాణ్ణి చేరవా.. సుస్వాగతం నవరాగామా చరణం:1

అంతే లేని వేగంతోని ప్రేమే వస్తుంటే నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే ఇంకా క్షేమంగానే జీవిస్తా నీ చేయందిస్తుంటే ఆ చేతులే నీకు పూలదండగా మెడలోన వేసి నీ జంట చేరనా నా చూపు సూత్రంగా ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలనా.. మౌనమే మాని గానమై పలికే నా భావన..... ఆఆ...ఆ..ఆ.. ప ని స గ ని ని స.... సుస్వాగతం నవరాగమా చరణం:2

సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికి రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికి మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్లు పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి.. ఏనాడు చూసానో రూపురేఖలు ఆనాడే రాసాను చూపులేఖలు ఏ రోజు లేవమ్మా ఇన్ని వింతలు ఈవేళ నా ముందు ప్రేమపుంతలు ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా..... ఆఆ....ఆ..ఆ... ప ని స గ ని ని స... వచ్చింది పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం... అందాల నీలాకాశం అందుకున్న సంబరం సుస్వాగతం నవరాగామా..... పలికిందిలే యదసరిగమ.... ప్రియ దరహాసమా...ప్రేమ ఇతిహాసమా.... నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా.... ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా.. సుస్వాగతం నవరాగామా.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి