చిత్రం: వర్షం(2004)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మల్లికార్జున్, కల్పన
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే వాడంటే వాడే మగ వాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే
చరణం: 1 : ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే ఆ: నీ కౌగిలింత నా కోట చేసుకుంటా చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా..... చరణం: 2: చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలోలాలస కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా ఇక నీ దే భారోసా వందేళ్ళ శ్వాస నీ పేర రాసేసా ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే వాడంటే వాడే మగ వాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి