Varsham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Varsham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, డిసెంబర్ 2024, సోమవారం

Varsham : Langa Voni Song Lyrics (హే లంగా వోణీ నేటితో రద్దై పోని)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: టిప్పు, ఉష

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని సర్లేగాని చక్కగా పెళ్లైపోని అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించనీ హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని ... haaa చరణం: 1 :

ఓ చూడు మరి దారుణం ఈడునెలా ఆపడం వెంటపడే శత్రువయే సొంత వయ్యారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధానం హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం హే లంగా వోణీ నేటితో రద్దై పోని అరె సింగారాన్నీ చీరతో సిద్దంకాని ..haaanyee... చరణం: 2 : సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తాళదు నా గాలి దుమారం కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలిపడే లాలనతో లొంగదు భారం ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ హాయ్ హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ నేటితో రద్దై పోని సర్లేగాని చక్కగా పెళ్లైపోని హేయ్ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని

5, జులై 2021, సోమవారం

Varsham : Jhule Jhule Song Lyrics (ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మల్లికార్జున్, కల్పన

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




పల్లవి :

ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే వాడంటే వాడే మగ వాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే

చరణం: 1 : ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే ఆ: నీ కౌగిలింత నా కోట చేసుకుంటా చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా..... చరణం: 2: చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలోలాలస కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా ఇక నీ దే భారోసా వందేళ్ళ శ్వాస నీ పేర రాసేసా ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే వాడంటే వాడే మగ వాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే






3, జులై 2021, శనివారం

Varsham : Neeti Mullai Song Lyrics (నీటి ముల్లై నన్ను గిల్లి)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సాగర్, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె వాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండి వాన తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేమోనిపించి కనుమరుగై కరిగావా సిరి వాన... నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన


Varsham : Kopama Naapaina Song Lyrics (కోపమా నాపైన)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్, శ్రేయ ఘోషల్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




పల్లవి :

కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా చాలులే నీ నటన సాగవే ఇటుపైనా ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనె లలనా దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన మన దారులు ఎప్పటికైనా కలిసేనా

చరణం: 1 : కస్సుమని కారంగా కసిరినది చాలింక ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువు గొడుగును ఎగరేస్తావే జడివానా కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా చరణం: 2:

తిరిగి నిను నాదాక చేర్చినది చెలిమేగా మనసులోని చెలియవమ్మా చెరిపినా చెరగవుగనుక సులువుగా నీలాగా మరచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా



29, జూన్ 2021, మంగళవారం

Varsham : Nuvvosthanante Song Lyrics (చినుకు రవ్వలో)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మల్లికార్జున్, కల్పన

సంగీతం: కె.యస్.చిత్ర , రకీబు ఆలం




పల్లవి :

చినుకు రవ్వలో… చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో చినుకు రవ్వలో… చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో పంచవన్నె చిలకలల్లె… వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న… వాన గువ్వలో చినుకు రవ్వలో… చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో

చరణం: 1 :

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే… చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే… నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త ఇన్నాళ్ళకు… గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని… దాక్కుంటావే పైన

చరణం: 2:

ముద్దులొలికే ముక్కుపుడకై… ఉండిపోవే ముత్యపు చినుకా చెవులకు చక్కా జూకాల్లాగా… చేరుకోవే జిలుగుల చుక్కా చేతికి రవ్వల గాజుల్లాగా… కాలికి మువ్వల పట్టీలాగా మెళ్లో పచ్చల పతకంలాగా… వగలకు నిగనిగ నగలను తొడిగేలా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా హా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆహా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా చిన్ననాటి తాయిలంలా… నిన్ను నాలో దాచుకోనా కన్నెఏటి సోయగంలా… నన్ను నీలో పోల్చుకోనా పెదవులు పాడే… కిలకిల లోనా పదములు ఆడే… కథకళి లోనా కనులను తడిపే… కలతల లోనా నా అణువణువున… నువు కనిపించేలా నువ్వొస్తానంటే హా… నేనొద్దంటానా నువ్వొస్తానంటే హే హే… నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త… ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే… చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే… నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా…




Varsham : Mellaga Karagani Song Lyrics (మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం)

చిత్రం: వర్షం(2004 ) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: S.P.B.చరణ్, సుమంగళి






పల్లవి:

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం

చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం

చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం

తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుల వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం


చరణం:1

నీ మెలికలలోన ఆ మెరుపును చూస్తున్నా

ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా

ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా

ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా

మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా

జతపడే స్నేహమై అనునయించనా

చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా


చరణం:2

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా

నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా

ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా

ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైనా

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా

విడుదలే వద్దనే ముడులువేయనా

మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా





Varsham : Nizam Pori Song Lyrics (నచ్చావే నైజాం పోరి)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: అద్నాన్ సమీ, సునీత రావు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

హోయ్... హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి హే ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హేయ్ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

చరణం: 1 :

హే... సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తినారి ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి హే పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

చరణం: 2 :

హే... వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరి హేయ్ చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓ సారి మైకంలో తూరి ఓ సారి కావ్యంలో వాలి ఓసారి వాహ్ వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని