21, జులై 2021, బుధవారం

Vetagadu : Puttintollu Tharimesaru Song Lyrics (పుట్టింటోళ్ళు తరిమేశారు)

చిత్రం: వేటగాడు

సంగీతం:కే చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం , P.సుశీల


పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యో.. పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా.. నాసామి కట్టుకుంటే మూడేముళ్ళురా.. పట్టుమని పదారేళ్ళురా.. నాసామి కట్టుకుంటే మూడేముళ్ళురా..ఆ..ఆ.. అయ్యోపాపం పాపాయమ్మ.. టింగురంగ బంగారమ్మా అయ్యోపాపం పాపాయమ్మ.. టింగురంగ బంగారమ్మా పట్టు చూస్తే పాతికేళ్ళులే.. ఓ రాణి.. కట్టుకథలు చెప్పమాకులే.. పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యోపాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగ బంగారమ్మా.. హా.. గడప దాటిన్నాడే కడప చేరానూ.. తలకుపోసిన్నాడే.. తలుపు తీశానూ వలపులన్ని కలిపి వంట చేసుంచానూ..ఊ..ఊ..ఉ. ఇంటికొస్తే సామీ వడ్డించుకుంటానూ.. వడ్డించుకుంటానూ.. అమ్మతోడు ఆదివారం నాడు అన్నమయినా అంటుకోను నేను ఓయబ్బో.. అమ్మతోడు ఆదివారం నాడు అన్నమయినా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్థరాతిరి ముద్దుకయినా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్థరాతిరి ముద్దుకయినా ముట్టుకోను ముద్దుకయినా ముట్టుకోను పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యోపాపం పాపాయమ్మ.. కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగ బంగారమ్మా.. ఘజ్జల్లున్ననాడు ఘల్లుమంటుంటానూ.. రంగమున్నాన్నాళ్ళు రంగేసుకుంటానూ.. తోడు దొరికిననాడు గూడు కట్టుకుంటానూ.. నీమీద ఒట్టు.. నువ్వే.. ఆ..!! నువ్వే మొగడనుకుంటానూ నువ్వే మొగడనుకుంటానూ అమ్మతల్లి అషాడమాసం.. అందులోనూ ముందుంది మూఢం ఆ..హు..హు.. అమ్మతల్లి అషాడమాసం.. అందులోనూ ముందుంది మూఢం అమ్మ బాబోయ్.. కాలేను నీతోడు నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. అమ్మ బాబోయ్.. కాలేను నీతోడు నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. పుట్టింటోళ్ళు తరిమేశారు చ్చు..చ్చు..చ్చు..చ్చు.. ఆ.. కట్టుకున్నోడు వదిలేశాడు చ్చు..చ్చు..చ్చు..చ్చు.. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగ బంగారమ్మా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి