Vetagadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vetagadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2024, మంగళవారం

Vetagadu : Jaabilitho Cheppanaa Song Lyrics (జాబిలితో చెప్పనా..)

చిత్రం: వేటగాడు (1979)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: చక్రవర్తి




పల్లవి : జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా.. జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా .. జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా చరణం 1 : తుమ్మెదలంటని తేనెలకై .. తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో .. సిగ్గులు కలవని విరహాలు చూపులలో చలి చురచురలూ .. ఆకలి తీరని విరవిరలూ ... అన్ని ఆవిరి పెడుతుంటే ... నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా  జాబిలితో చెప్పనా .. జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా చరణం 2 : గొంతులు దాచిన గుండెలలో .. కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో .. అలలై పొంగిన అందాలు కౌగిట కాముని పున్నములు .. వెన్నెల వీణల సరిగమలు .. పేరంటానికి రమ్మంటే ... పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా .. జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా.. జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా రోజా.. రాజా... రోజా.. రాజా రోజా.. రాజా... రోజా.. రాజా

16, జనవరి 2022, ఆదివారం

Vetagadu : Aku Chaatu Pinda Thadise Song Lyrics (ఆకు చాటు పిందె తడిసే)

చిత్రం: వేటగాడు

సంగీతం:కే చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం , P.సుశీల


ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చీ ఓ చినుకు ముత్యమైపోతుంటే అహ అహ అహ అహ చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే అహ అహ అహ అహ ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే!! నీ మాట విని మబ్బు మెరిసే అహా... జడి వానలే కురిసీ కురిసీ వళ్ళు తడిసీ వెల్లీ విరిసీ చిలిపి చినుకుల్లో తల దాచుకోవాలి అహ అహ అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే అహ అహ అహ అహ ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే అహ అహ అహ అహ ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే అహా నీ పాట విని మెరుపులోచ్చీ అహా నీ విరిపూలే ముడుపులిచ్చీ చలిని పెంచీ చెలిమి పంచీ తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి అహ అహ అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే అహ అహ అహ అహ కొమ్మచాటు పువ్వు తడిసే అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది

21, జులై 2021, బుధవారం

Vetagadu : Puttintollu Tharimesaru Song Lyrics (పుట్టింటోళ్ళు తరిమేశారు)

చిత్రం: వేటగాడు

సంగీతం:కే చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం , P.సుశీల


పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యో.. పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా.. నాసామి కట్టుకుంటే మూడేముళ్ళురా.. పట్టుమని పదారేళ్ళురా.. నాసామి కట్టుకుంటే మూడేముళ్ళురా..ఆ..ఆ.. అయ్యోపాపం పాపాయమ్మ.. టింగురంగ బంగారమ్మా అయ్యోపాపం పాపాయమ్మ.. టింగురంగ బంగారమ్మా పట్టు చూస్తే పాతికేళ్ళులే.. ఓ రాణి.. కట్టుకథలు చెప్పమాకులే.. పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యోపాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగ బంగారమ్మా.. హా.. గడప దాటిన్నాడే కడప చేరానూ.. తలకుపోసిన్నాడే.. తలుపు తీశానూ వలపులన్ని కలిపి వంట చేసుంచానూ..ఊ..ఊ..ఉ. ఇంటికొస్తే సామీ వడ్డించుకుంటానూ.. వడ్డించుకుంటానూ.. అమ్మతోడు ఆదివారం నాడు అన్నమయినా అంటుకోను నేను ఓయబ్బో.. అమ్మతోడు ఆదివారం నాడు అన్నమయినా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్థరాతిరి ముద్దుకయినా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్థరాతిరి ముద్దుకయినా ముట్టుకోను ముద్దుకయినా ముట్టుకోను పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యోపాపం పాపాయమ్మ.. కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగ బంగారమ్మా.. ఘజ్జల్లున్ననాడు ఘల్లుమంటుంటానూ.. రంగమున్నాన్నాళ్ళు రంగేసుకుంటానూ.. తోడు దొరికిననాడు గూడు కట్టుకుంటానూ.. నీమీద ఒట్టు.. నువ్వే.. ఆ..!! నువ్వే మొగడనుకుంటానూ నువ్వే మొగడనుకుంటానూ అమ్మతల్లి అషాడమాసం.. అందులోనూ ముందుంది మూఢం ఆ..హు..హు.. అమ్మతల్లి అషాడమాసం.. అందులోనూ ముందుంది మూఢం అమ్మ బాబోయ్.. కాలేను నీతోడు నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. అమ్మ బాబోయ్.. కాలేను నీతోడు నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా.. పుట్టింటోళ్ళు తరిమేశారు చ్చు..చ్చు..చ్చు..చ్చు.. ఆ.. కట్టుకున్నోడు వదిలేశాడు చ్చు..చ్చు..చ్చు..చ్చు.. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగ బంగారమ్మా..