6, ఆగస్టు 2021, శుక్రవారం

20 Va Satabdam : Naa Prema Navaparijatham Song Lyrics (నా ప్రేమ నవ పారిజాతం పలికింది)

చిత్రం:- 20వ శతాబ్దం (1983)

సాహిత్యం:- సి.నారాయణరెడ్డి

గానం:- యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం:- జె. వి. రాఘవులు


పల్లవి: నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కధ మీటగా నీ ఎద వీణపై మన కధ మీటగా అనురాగాల రాగావిరానా నూరేళ్ళ బంధాన్ని కానా  నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం చరణం1: వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా  స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై  గతజన్మ బంధాలు నేడు జతగూడి రావాలి తోడు  గగనాల పందిళ్లలోనా సగభాగమవుతాను నీకు  ఇక సుముహూర్త మంత్రాలలోనా శృతి చేయి అనురాగ వీణ నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం చరణం2: ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లోకాలే జయించే మనస్సే నీకొసం నిజంగా తపించే  సరసాల సమయాలలోనా మనసార పెనవేసుకోనా  అణువైన నా గుండెలోనా కడదాక నిను దాచుకోనా  ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా పరువాలు పండించుకోనా  నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కధ మీటగా నీ ఎద వీణపై మన కధ మీటగా అనురాగాల రాగావిరానా నూరేళ్ళ బంధాన్ని కానా  నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి