చిత్రం:- రాజ కుమార్(1983)
సాహిత్యం:- ఆత్రేయ
గానం:- యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం:- ఇళయరాజా
పల్లవి:
జానకి కలగనలేదు
రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది
ఈనాడు మనకూ నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు
జానకి పతికాగలనని ఆనాడు
చరణం:1
చెలిమనసే శివధనుసైనది
తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు
గెలువనిది ఏది
ఒక బాణం ఒక భార్యన్నది
శ్రీరాముని చిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి
తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాక నీవే మరుజన్మకి నీవే
ఆ....ఆ....ఆ....ఆ....
జానకి కలగనలేదు
రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు
చరణం:2
సహవాసం మనకు నివాసం
సరిహద్దు నీలాకాశం
ప్రతి పొద్దు ప్రణయావేశం
పెదవులపై హాసం
సుమసారం మన సంసారం
మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కథ కానిది నీవే
కలలన్ని నావే కలకాలం నీవే
ఆ....ఆ....ఆ....ఆ....
రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు
రాముని సతి కాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది
ఈనాడు మనకూ నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం
లా లల..లాలల లాల..
లా లల..లాలల లాల.. ల ల ల
లా లల..లాలల లాల..
లా లల..లాలల లాల.. ల ల ల
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి