11, ఆగస్టు 2021, బుధవారం

Aapathbandhavudu : Chukkallara Choopullara Song Lyrics (చుక్కలారా చూపుల్లారా)

చిత్రం: ఆపద్బాంధవుడు(1992)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:  కె.యస్.చిత్ర



చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ? విన్నవించరా వెండి మింటికీ? జో జో.. లాలీ...  జో జో... లాలీ  చరణం 1 : మలి సంధ్య వేళాయే.. చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే.. కనుపాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే.. నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే.. గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే జోల పాడవా బేల కళ్ళకి.. వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ జో జో లాలీ.. జో జో లాలీ... జో జో లాలీ.. జో జో లాలీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి