Aapadbandhavudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aapadbandhavudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2021, బుధవారం

Aapathbandhavudu : Chukkallara Choopullara Ekkadamma Song Lyrics (చుక్కల్లారా చూపుల్లారా )

చిత్రం: ఆపద్బాంధవుడు(1992)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండిమింటికి జోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి.. చరణం : మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే(2) నిదురమ్మా ఎటుబోతివే మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటుబోతివే కునుకమ్మా ఇటు చేరవే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల రెక్కలపైనా రివ్వూరివ్వున రావే జోలపాడవా బేలకళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జోజో లాలి జోజో లాలి... చరణం : పట్టుపరుపులేల పండువెన్నెలేల అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే నారదాదులేల నాదబ్రహ్మలేల అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్నివేల వెన్నెల్లో తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల కోటితందనాల ఆ నందలాల గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యాడనుంది ఆల నాటి నందనాల ఆనందలీల జాడచెప్పరా చిట్టితల్లికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జోజో లాలి జోజో లాలి.. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి.....

Aapathbandhavudu : Chukkallara Choopullara Song Lyrics (చుక్కలారా చూపుల్లారా)

చిత్రం: ఆపద్బాంధవుడు(1992)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:  కె.యస్.చిత్ర



చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ? విన్నవించరా వెండి మింటికీ? జో జో.. లాలీ...  జో జో... లాలీ  చరణం 1 : మలి సంధ్య వేళాయే.. చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే.. కనుపాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే.. నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే.. గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే జోల పాడవా బేల కళ్ళకి.. వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ జో జో లాలీ.. జో జో లాలీ... జో జో లాలీ.. జో జో లాలీ

1, జులై 2021, గురువారం

Aapathbandhavudu : Aura Ammakuchella Song Lyrics (ఔరా అమ్మక చెల్లా)

చిత్రం: ఆపద్బాంధవుడు(1992)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా

అంత వింత గాథల్లో ఆనందలాలా


బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా


ఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికి

ఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికి


బాలుడా?..  గోపాలుడా? ...  లోకాల పాలుడా?

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!


ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా

అంత వింత గాథల్లో ఆనందలాలా 



చరణం 1 :


ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే

ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే

నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల

వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల


ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల

జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల


బాలుడా?...  గోపాలుడా?...  లోకాల పాలుడా?...

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!


ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా

అంత వింతగాథల్లో ఆనందలాలా..


బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...


చరణం 2 :


ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల

ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల

వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల

తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల


బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా


ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా

అంత వింతగాథల్లో ఆనందలాలా


బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా


ఆనందలాలా... ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా