చిత్రం : అడవి దొంగ (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
పల్లవి:
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు మహారాజులా మనసేలుకో మహారాణిలా మనువాడుకో చరణం:1
వచ్చే వసంతకాలం విచ్చే సుమాల గంధం నీకై తపించి నిన్నే జపించే అందం కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శిల్పం నేనై చలించి నిన్నే వరించే బంధం కొండంటి పండు ముద్దంటా నా కొండమల్లి నువ్వంటా రసాల నవరసాల యమ మసాలా వేడిలో లవ్ బాయ్ లా లాలించవా కౌబాయ్ లా కవ్వించనా వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు చరణం:2
వాటేయకుంటే పాపం వయ్యారమెంత శాపం
పూచేటి సోకు దాచేసుకోకు నేరం
వలపన్నదెంత వేగం వల వేసి పట్టే మోహం
తీరేది కాదు నూరేళ్ళ తీపి దాహం
నీ రూపు నాకు చుక్కంటా
నా లేత బుగ్గకిమ్మంటా
పెట్టించు లగ్గమెట్టించు
ముద్దు పుట్టించే వేళలో
జాంపండులా దొరికావులే
జేమ్స్ బాండ్ లా కలిసావులే
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
చరణం:3
కౌగిళ్లు నీకు పంచి కసి ఈడు కాస్త పెంచి
కవ్వింతలోనే ఒళ్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్ను కొట్టి
దీపాల వేళ తాపాలు తీర్చిపోవే
చిలకంటి దాణ్ణి నేనంటా
అలకల్లో ఉంది సోకంతా
తందాన తాన తందానా
జంట తాళాలే సాగని
హీరోలకే హీరోవిరా
హీమ్యాన్ లా ప్రేమించనా
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహారాజులా మనసేలుకో
మహారాణిలా మనువాడుకో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి