Adavi Donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Adavi Donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2021, గురువారం

Adavi Donga : Veera Vikrama Song Lyrics (వీర విక్రమ )

చిత్రం:  అడవి దొంగ (1985)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల


పల్లవి: వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు మహారాజులా మనసేలుకో మహారాణిలా మనువాడుకో చరణం:1 వచ్చే వసంతకాలం విచ్చే సుమాల గంధం నీకై తపించి నిన్నే జపించే అందం కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శిల్పం నేనై చలించి నిన్నే వరించే బంధం కొండంటి పండు ముద్దంటా నా కొండమల్లి నువ్వంటా రసాల నవరసాల యమ మసాలా వేడిలో లవ్ బాయ్ లా లాలించవా కౌబాయ్ లా కవ్వించనా వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు చరణం:2 వాటేయకుంటే పాపం వయ్యారమెంత శాపం పూచేటి సోకు దాచేసుకోకు నేరం వలపన్నదెంత వేగం వల వేసి పట్టే మోహం తీరేది కాదు నూరేళ్ళ తీపి దాహం నీ రూపు నాకు చుక్కంటా నా లేత బుగ్గకిమ్మంటా పెట్టించు లగ్గమెట్టించు ముద్దు పుట్టించే వేళలో జాంపండులా దొరికావులే జేమ్స్ బాండ్ లా కలిసావులే వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు చరణం:3 కౌగిళ్లు నీకు పంచి కసి ఈడు కాస్త పెంచి కవ్వింతలోనే ఒళ్లంతా దోచిపోరా మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్ను కొట్టి దీపాల వేళ తాపాలు తీర్చిపోవే చిలకంటి దాణ్ణి నేనంటా అలకల్లో ఉంది సోకంతా తందాన తాన తందానా జంట తాళాలే సాగని హీరోలకే హీరోవిరా హీమ్యాన్ లా ప్రేమించనా వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు మహారాజులా మనసేలుకో మహారాణిలా మనువాడుకో

Adavi Donga : Vana Vana Vandanam Song Lyrics (వానా వానా వందనం...)

చిత్రం:  అడవి దొంగ (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 


అ ఆ ఆ.. వానా వానా వందనం... ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం నీవే ముద్దుకు మూలధనం పడుచు గుండెలో గుప్తధనం ఇద్దరి వలపుల ఇంధనం ఎంత కురిసినా కాదనం ఏమి తడిసినా.. ఆ.. ఆ.. వద్దనం... ఈ దినం.. లల్లల్ల..లాలా.. లాలా.. అ ఆ ఆ.. వాన వాన వందనం... ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం చలి పెంచే నీ చక్కదనం... కౌగిట దూరే గాలి గుణం గాలి వానల కలిసి రేగుతూ.. కమ్ముకుపోతే యవ్వనం చినుకు చినుకులో చల్లదనం చిచ్చులు రేపే చిలిపితనం వద్దంటూనే వద్దకు చేరే ఒళ్లో ఉందీ పడుచుతనం మెరుపులు నీలో చూస్తుంటే... ఉరుములు నీలో పుడుతుంటే వాటేసుకొని తీర్చుకో... వానదేవుడి వలపు ఋణం... వాన దేవుడి వలపు ఋణం... అ ఆ ఆ.. వానా వానా వందనం... ఆ ఆ ఆ.. వయసా.. వయసా.. వందనం కసిగ ఉన్న కన్నెతనం... కలబడుతున్న కమ్మదనం చెప్పలేక నీ గుండ వేడిలో... హద్దుకుపోయిన ఆడతనం ముద్దుకు దొరికే తియ్యదనం ముచ్చట జరిగే చాటుతనం కోరి కోరి నీ పైట నీడలో.. నిద్దుర లేచిన కోడెతనం చినుకులు చిట పటమంటుంటే .. చెమటలు చందనమౌతుంటే... చలి చలి పూజలు చెసుకో... శ్రావణమాసం శోభనం .. శ్రావణమాసం శోభనం అ ఆ ఆ వానా వానా వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం నీవే ముద్దుకి మూలధనం.. పడుచు గుండెలో గుప్తధనం... ఇద్దరి వలపుల ఇంధనం.. ఎంత కురిసిన కాదనం... ఏమి తడిసినా వద్దనం... ఈ దినం.. లల్లల్ల..లాలా.. లాలా.. అ ఆ ఆ వానా వానా వందనం... ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం