16, ఆగస్టు 2021, సోమవారం

Anubandham : Anati aa sneham Song Lyrics (ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం)

చిత్రం : అనుబంధం(1984)

సంగీతం: కే. చక్రవర్తి

సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ

గానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి 



ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆరోజులు మునుముందిక రావేమిరా లేదురా ఆ సుఖం రాదురా ఆ గతం ఏమిటో జీవితం గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకటిలో పిల్లనుకొని ఒరే... పక్కనే పెళ్ళికావలసిన పిల్లలున్నార్రా నేర్చుకుంటార్రా... నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు ఈ నేల ఆ నింగి ఆలాగె వున్నా ఈ గాలి మోస్తుంది మన గాధలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగ వుంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా ఒరే రాస్కెల్ జ్ఞాపకముందిరా కాలేజిలో క్లాస్ రూములో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప యెడమ కాలి చెప్పు తీసుకొని ఒరే ఉండరా ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటార్రా పిల్లల పిల్లలకు పిట్టకథలుగా చెప్పుకుంటారు. ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆరోజులు మునుముందిక రావేమిరా మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిచ్చై మండినాను నా గుండె మంటింక ఆరేదికాదు నేనుండి తనువెళ్ళి బ్రతుకింక లేదు తన శాపమే నాకు తగిలిందిరా రే పసిపాపలే లేని ఇల్లాయెరా ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా ఒరే ఒరే ఏమిట్రా పసిపాపలాగా ఛ ఛ ఊరుకో ఒరే ఈ కన్నీళ్లకు తుది ఎక్కడ్రా కర్చీఫ్ తో తుడిచేటమేరా ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఆ రియల్లీ ఫబ్లౌస్ ఆహ ఆహ ఆహ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి