Anubandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anubandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మార్చి 2024, గురువారం

Anubandham : Jim Jim taarare Song Lyrics (జింజింతారారే ఏ ఏ)

చిత్రం: అనుబంధం(1984)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: కే. చక్రవర్తి



పల్లవి:

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు నాలో చూడు దగ్గరైన ప్రాణాలు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం సందెపొద్దువేళాయే చందమామ రావే చీకటైన పొదరింట దీపమెట్టిపోవే నన్నే తాకే అగ్గిపూల బాణాలు నాకే సోకే కొంటెచూపు కోణాలు చరణం 1: పువ్వుల వానల్లో నవ్వుల నావల్లే నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే సూరీడేమో కొండలు దాటే నా ఈడేమో కొంగులు దాటే నీ ముద్దు తాంబూలమిచ్చుకో ఎర్రంగ వలపే పండించుకో తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చరణం 2: కొండకోనల్లో ఎండవానల్లో మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే వేసవి చూపుల్తో రాసిన జాబుల్తో అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే అల్లరి కళ్ళు ఆరాతీసే దూరాలన్ని చేరువచేసే ఒడిచేరి పరువాలు పంచుకో బిడియాల గడపింక దాటుకో నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు నీకు నాకు పెళ్ళిచేసే చుట్టాలూ జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే సందెపొద్దువేళాయే చందమామ రావే నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు నన్నే తాకే అగ్గిపూల బాణాలు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ

25, జూన్ 2022, శనివారం

Anubandham : Prathi Reyi Song Lyrics (ప్రతిరేయి రావాలా)

చిత్రం : అనుబంధం(1984)

సంగీతం: కే. చక్రవర్తి

సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



M: ఆహా..ఆ హా ఆ ఆ హా.. మ F: ఆహా హా అహ ఆహాహా.. M.ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ M:తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ M:సన్నజాజి పొదరింట.... M: సన్నసన్నని వెన్నెలంట M:మనమీద వాలాలా... మల్లెలై పోవాలా -M: మనమీద వాలాలా... పోవాలా . మల్లెలై F: ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ F: తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ..ఆ F:అలిగేటీ పడకింట... అల్లుకొన్న వెన్నెలంట Fమనమీద వాలాలా... మల్లెలై పోవాలా F:మనమీద వాలాలా... మల్లెలై పోవాలా M:అలిగే అందాలు చూసి కవ్వించనా -M: తొలిగే బేధాలు చూసి నవ్వించనా F:మనసు పడుచైనా మీకు మతి చెప్పెనా F:మతి మీతోపాటు పోయి శృతి తప్ప Mమళ్ళీ తొలిరేయి మొగ్గు చూపించనా Mమళ్ళి తొలినాటి సిగ్గు: మొలిపించనా.. F;చిలిపి శ్రీవారికింత వలపాయెనా F:చిలిపి శ్రీవారికింత వలపాయెనా F:మళ్ళీ శ్రీమతి మీద మనసాయెనా.. హాహా M.ప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ F:తొలిరేయి కావాలా.. ఆ.. ఆ.. ఆ.. ఆ M.సన్నజాజి పొదరింట... M:సన్న సన్నని వెన్నెలంట F:మనమీద వాలాలా... మల్లెలై పోవాలా M:మనమీద వాలాలా.... . మల్లెలై పోవాలా F:ఇన్నాళ్ళు లేని వయసు ఇపుడొచ్చెనా F:ఇంట్లో ఇల్లాలు నేడు గురుతొచ్చెనా M:మనసే కొన్నాళ్ళ పాటు నిదరోయినా M:మనసై నీ ఒడిలోకి నేను చేరనా F:మళ్ళీ విరజాజిపూలు నేడు విచ్చెనా F:తల్లో ఈనాడు వలపు పూలుపూచెనా M:నన్నె ఇన్నాళ్ళు నే మరిచిపోయినా M:నన్నె ఇన్నాళ్ళు నే మరిచిపోయినా M:మళ్ళీ నీ కోసమే మేలుకొన్నా... హా..హాహా Fప్రతిరేయి రావాలా.. ఆ.. ఆ..ఆ.. ఆ.. M: ఊ ఊ ఊ తొలిరేయి కావాలా..ఆ.. ఆ..ఆ.. ఆ.. F:అలిగేటీ పడకింట... అల్లుకొన్న వెన్నెలంట M:మనమీద వాలాలా... మల్లెలై పోవాలా F+M:మనమీద వాలాలా... మల్లెలై పోవాలా



ఆ ఆ హ హ హ హ ఉమ్మ్ ఆ ఆ హ హ హ హ ప్రతి రేయి రావాలా తొలి రేయి కావాలా సన్నజాజి పొదరింట సన్నసన్నని వెన్నెలంట మనమీద వాలాల మల్లెలై పోవాలా మనమీద వాలాల మల్లెలైపోవాలా ప్రతి రేయి రావాలా తొలి రేయి కావాలా అలిగేటి పడకింట అల్లుకున్న వెన్నెలంట మనమీద వాలాల మల్లెలై పోవాలా మనమీద వాలాల మల్లెలైపోవాలా అలిగే అందాలు చూసి కవ్వించనా తొలిగే బేరాలు చూసి నవ్వించనా మనసు పడుచైన మీకు మతిచెప్పనా మతి మీతోపాటు పోయి శృతి తప్పనా మళ్లీ తొలిరేయి మొగ్గు చూపించనా మళ్లీ తొలినాటి సిగ్గు మొలిపించనా చిలిపి శ్రీవారికింత వలపాయెనా చిలిపి శ్రీవారికింత వలపాయేనా మళ్లీ శ్రీమతి మీద మనసాయేనా హ హ హ హ హ ప్రతి రేయి రావాలా తొలిరేయి కావాలా సన్నజాజి పొదరింట సన్నసన్నని వెన్నెలంట మనమీద వాలాల మల్లెలైపోవాలా మనమీద వాలాల మల్లెలైపోవాలా ఇన్నాళ్ళు లేని వయసు ఇప్పుడొచ్చేనా ఇంట్లో ఇల్లాలు నేడు గురుతొచ్చేనా మనసే కొన్నాళ్ళపాటు నిదరోయినా మనసై నీ ఒడిలోకి నేను చేరనా మల్లీ, విరజాజి పూలు రెండు విచ్చెనా తల్లో ఈనాడు వలపు పూలు పూచేనా నన్నే ఇన్నాళ్ళు నే మరచిపోయిన నన్నే ఇన్నాళ్ళు నే మరచిపోయిన మళ్లీ నీ కోసమే మేలుకొన్న హ హ హ హ హ ప్రతి రేయి రావాలా మ్ మ్ మ్. తొలి రేయి కావాలా అలిగేటి పడకింట అల్లుకున్న వెన్నెలంట మనమీద వాలాల మల్లెలై పోవాలా మనమీద వాలాల మల్లెలైపోవాలా