1, ఆగస్టు 2021, ఆదివారం

Bobbili Puli : Janani Janmabhoomischa Song Lyrics (జననీ జన్మ భూమిశ్చ)

చిత్రం: బొబ్బిలి పులి (1982 )

సంగీతం: జె. వి. రాఘవులు

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం



జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆ ఋణం తలకొరివితో తీరేనురా ఈ ఋణం ఏ రూపాన తీరేనురా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధేంటో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి