చిత్రం: ఆరాధన (1976 )
రచన: సి. నారాయణ రెడ్డి
గానం: మహమ్మద్ రఫీ
సంగీతం: సాలూరి హనుమంత రావు
పల్లవి:
ఓ ప్రియతమా ప్రియతమా..
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
చరణం 1:
ఎవ్వరివో నీవు నేనెరుకలేను
ఏ పేరున నిన్ను నే పిలవగల నూ
ఎవ్వరివో నీవు నేనెరుకలేను
ఏ పేరున నిన్ను నే పిలవగల నూ
తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
చరణం 2:
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాకా దాచేను ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాకా దాచేను వేచిన మదినే వెలిగింప రావే వేచిన మదినే వెలిగింప రావే ఆరని అనురాగ దీపమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి