10, ఆగస్టు 2021, మంగళవారం

Collector Gari Alludu : Gilli Gichi Alli Buchi jallu kottindhi Song Lyrics (గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది)

చిత్రం:కలెక్టర్ గారి అల్లుడు(1992)

సంగీతం:రాజ్-కోటి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి: గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్లో తళ్లో మెళ్లో జళ్లో మంట పెట్టింది వాన దుప్పట్లో గాలి చప్పట్లో వాన దుప్పట్లో గాలి చప్పట్లో సూరీడు చల్లారి నా ఈడు వేడెక్కి పింఛాలు విప్పింది మంచాలు కోరింది గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్లో తళ్లో మెళ్లో జళ్లో మంట పెట్టింది చరణం:1 మోహాలెన్నో మేఘాలల్లే మూసుకొస్తుంటే దాహాలన్ని ఆహా అంటూ తీరేనమ్మా గాలి వాన నువ్వు నేనై కమ్ముకొస్తుంటే నాలో జోరు నీలో నీరు నీకేనమ్మా నీ వింత కోణాలు వానమ్మ బాణాలు తాకే వేళల్లో నా కన్నె ప్రాణాలు నీ మేజువాణీలు చేసే వేళల్లో కరిగిపో ఆషాఢ మేఘాల కవ్వింతలో తడుముకో దాచేది ఏముంది తుళ్ళింతలో నీ లేత అందాలు నా సొంత లాభాలు లాగించనా ఇప్పుడే గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్లో తళ్లో మెళ్లో జళ్లో మంట పెట్టింది చరణం:2 సందెల్లోన ఒళ్లు ఒళ్లు సంధికొస్తుంటే డేరాలేసి నేరాలెన్నో చెయ్యాలమ్మా చల్ల గాలి కౌగిట్లోన చచ్చిపోతుంటే వత్తిళ్ళమ్మ తిరునాళ్ళింకా సాగాలమ్మా ఊరించ వస్తావు ఊగించి పోతావు ఉయ్యాల బుల్లోడా కళ్లేమో మూసేసి కానివ్వమంటావు కిల్లాడీ బుల్లెమ్మా చిలిపిగా శ్రీమన్మథాకార లాలించుకో చినుకులా చీరమ్మనీపూట జాడించుకో వానమ్మ పాఠాలు వయ్యారి వాటాలు నేర్పించనా పిల్లడూ గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్లో తళ్లో మెళ్లో జళ్లో మంట పెట్టింది వాన దుప్పట్లో గాలి చప్పట్లో వాన దుప్పట్లో గాలి చప్పట్లో సూరీడు చల్లారి నా ఈడు వేడెక్కి పింఛాలు విప్పింది మంచాలు కోరింది గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్లో తళ్లో మెళ్లో జళ్లో మంట పెట్టింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి