చిత్రం: భలే మావయ్య(1994)
సంగీతం:రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి: మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో ఇద్దరి కన్నుల అల్లరి చేసిన సంధ్యారాగంలో కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో వారెవా జోరు హై జోరులో ప్యార్ హై మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో చరణం 1: నంది కొండ మీదకొచ్చి నల్లమబ్బు కన్నుగీటె సిగ్గుపడ్డ చందమామ కోనలోన కాలు జారె ఎన్నందాలో చిగురాకు చీరలో ఏమవ్వాలో పిడిబాకు చూపుతో ఎల్లకిల్ల ఎల్లువైన పిల్ల సోకులో నిను అల్లుకున్న పూల జల్లు ఇల్లు చేసుకో కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో చరణం 2: పాలపిట్ట గూటి కాడ పైట కొంగు భారమాయె పాలకొండ సీమలోన బంతులాట పండగాయె ఏం కావాలో చినవాని దాడిలో ఏం చెయ్యాలో చలిగాలి హోరులో కాచుకున్న కౌగిలింత కాక తీర్చుకో తలదాచుకున్న గుండెలోన నన్ను దోచుకో కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో ఇద్దరి కన్నుల అల్లరి చేసిన సంధ్యారాగంలో కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి