7, ఆగస్టు 2021, శనివారం

Gulebakavali Katha : Nannu Dochukunduvate Song Lyrics (నన్ను దోచుకుందువటె)

చిత్రం : గులేబకావళి కథ (1962 )

సంగీతం: జోసెఫ్ - విజయ్ కృష్ణ మూర్తి

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి. సుశీల



నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి