చిత్రం : శ్రీ రామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస్
గానం: శంకర్ మహదేవన్, విజయ్ ఏసుదాస్
అల్లా ఆ... శ్రీ రామ................ శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడు కళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.... ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి ఏ మూర్తి నిరవాణ నిజధర్మ సమబర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి..... ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగని రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్రముర్తి తాగారా ఆ ఆ................... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ప ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ.... ప ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ కోందండ రామ.... మ ప ని స రి స ని ప ని ప మ సీతారామ.... మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ ఆనంద రామ.... మ మ రి మ రి మ రి స రి మ రామ... జయరామ... స రి మ రామ స ప మ రామ పావన నామ ఏ వేలుపు ఎల్ల వెలుపులును గొలిచెడి వేలుపు ఏ వేలుపు ఏడేడు లోకాలకే వేలుపు ఏ వేలుపు నిట్టుర్పు యిలను నిలుపు ఏ వేలుపు నిఖిల కల్యాణముల కలగల్పు ఏ వేలుపు నిగమ నిగామాలన్నిటిని తెలుపు ఏ వేలుపు నింగి నేలను కలపు ఏ వేలుపు ద్యుతిగొల్పు ఏ వేలుపు మరుగొల్పు ఏ వేలుపు దే మలపు లేని గెలుపు ఏ వేలుపు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఏ వేలుపు దాసానుదాసులకు కై వోర్పు తాగారా... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి