చిత్రం: జానకి రాముడు (1988 )
సంగీతం: కేవీ మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల తెలుగు పాట పాడవే తీయగా హాయిగా కు కు కు కుకు.....
వరదలా పొంగే పాట వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట వలపులా పిలిచే పాట అరుదైన వరదయ్య బిరుదైన క్షేత్రయ్య గోపాలా మువ్వ గోపాలా అని మురిసేటి తెలుగింటి పాట అని మురిసేటి తెలుగింటి పాట
కు కు కు................
తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై శ్రీరామ రారా రఘు రామా అని పిలిచేటి తెలుగింటి పాట అని పిలిచేటి తెలుగింటి పాట కు కు కు..................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి