చిత్రం: సంకీర్తన (1987)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకు నినుచేరి ఓ కమ్మని ఊసుని తెలిపేనే కవితవు నీవై పరుగున రా ఎద సడితో నటియించగ రా స్వాగతం సుస్వాగతం కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి కుకుకూ కుకుకూ కీర్తన తొలి ఆమనివై రా పిలిచే చిలిపి కోయిలా ఎట దాగున్నావో? మువ్వల రవళి పిలిచింది కవిత బదులు పలికింది కలత నిదుర చెదిరింది మనసు కలను వెతికింది వయ్యారాల గౌతమి ఈ కన్యారూప కల్పన వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన భావాల పూల రాగాల బాట నీకై వేచేనే కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శ్రుతి చేసి ఇది నా మది సంకీర్తన కుకుకూ కుకుకూ సుధలు రేయాలాపాన కుకుకూ కుకుకూ లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం మరందాల గానమే మృదంగాల నాదము ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము మేఘాల దారి ఊరేగు ఊహ వాలే ఈ మ్రోల కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శ్రుతి చేసి ఇది నా మది సంకీర్తన కుకుకూ కుకుకూ సుధలు రేయాలాపాన కుకుకూ కుకుకూ రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి