1, ఆగస్టు 2021, ఆదివారం

Janaki Ramudu : Na Gonthu Shrutilona Song Lyrics (నా గొంతు శృతిలోనా)

చిత్రం: జానకి రాముడు (1988 )

సంగీతం: కేవీ మహదేవన్

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



ఆ ఆ ఆ తానాన తననాన ఆ ఆ ఆ ఆ నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల ఆ నా గొంతు శృతిలోనా ఆ నా గుండె లయలోన ఒకమాట పదిమాటలై అది పాటకావాలని ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై వుండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై వుండాలని కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిడురలేపాలని ప్రతిరేయి పసిపాపనై నీ వోడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరుజన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరుజన్మ రావాలని వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి