1, ఆగస్టు 2021, ఆదివారం

Ankusam : Idi Cheragani Premaku Srikaram Song Lyrics (ఇది చెరగని ప్రేమకు శ్రీకారం)

చిత్రం: అంకుశం (1989 )

సంగీతం:సత్యం

సాహిత్యం: మల్లెమాల

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


🕺ఆ...ఆ...ఆ... 💃ఓ... ఓ.... ఓ.... 🕺ఆ...ఆ...ఆ... ఇది చెరగని ప్రేమకు శ్రీకారం 💃ఆ...ఆ...ఆ... 🕺ఇది మమతల మేడకు ప్రాకారం 💃ఓ... ఓ.... ఓ.... 🕺పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ.. కలకాలం వైభోగమస్తూ 💃ఇది చెరగని ప్రేమకు శ్రీకారం 🕺ఆ...ఆ...ఆ... 💃ఇది మమతల మేడకు ప్రాకారం 🕺ఓ... ఓ.... ఓ.... 💃పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ...కలకాలం వైభోగమస్తూ 🕺కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ 💃పారాణి మిసమిసలు పదములకు తెలుసూ పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ 🕺చిగురుటాశల..చిలిపి చేతలూ.. పసిడిబుగ్గల.. పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ... 💃ఇది చెరగని ప్రేమకు శ్రీకారం 🕺ఆ...ఆ...ఆ... 💃ఇది మమతల మేడకు ప్రాకారం 🕺ఓ... ఓ.... ఓ.... పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు 💃కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ 🕺కలకాలం వైభోగమస్తూ 💃ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం శ్రీవారికి చిరునవ్వె శ్రీమతికి అందం 🕺మింటికి పున్నమి జాబిల్లి అందం ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం 💃జన్మజన్మల పుణ్యఫలముగా జాలువారు పసిపాప నవ్వులే అలుమగలకూ అందం 🕺ఇది చెరగని ప్రేమకు శ్రీకారం 💃ఆ...ఆ...ఆ... ఇది మమతల మేడకు ప్రాకారం 🕺ఓ... ఓ.... ఓ.... పండిన కలలకు శ్రీరస్తూ 💃పసుపు కుంకుమకు శుభమస్తు 🕺💃కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ..కలకాలం వైభోగమస్తూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి