చిత్రం: జానకి రాముడు (1988 )
సంగీతం: కేవీ మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి: నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నను కరిగించే నవ నాదాలు అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు.... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నను కరిగించే నవ నాదాలు అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు.... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం చరణం:1 మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహనరాగాలు కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహనరాగాలు కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు ఎదుటే నిలిచిన చాలు...ఆరారు కాలాలు.... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం చరణం:2 జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు అడుగు అడుగునా రంగవల్లికలు పెదవి అడుగునా రాగమాలికలు అడుగు అడుగునా రంగవల్లికలు పెదవి అడుగునా రాగమాలికలు ఎదురై పిలిచిన చాలు................ ................................................ నీ మౌనగీతాలు......................... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నను కరిగించే నవ నాదాలు అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి