చిత్రం: జానకి రాముడు (1988 )
సంగీతం: కేవీ మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
అదిరింది మామా అదిరిందిరో ముదిరింది ప్రేమ ముదిరిందిరో ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిరో అదిరింది పిల్లా అదిరిందిలే కుదిరింది పెళ్లి కుదిరిందిలే ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే వలపు జోరు తేలాలిలే ఆకులిస్తా పోకలిస్తా కొరికి చూడు ఒక్కసారి ఆశలన్నీ వరస పెట్టి తన్నుకొచ్చి గిల్లుతాయి బుగ్గ మీద పంటి గాటు పడుతుంది ప్రతిసారి సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి మాపటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి మావ గొప్ప ఊరికంతా చాటుతుంది మరీ మరీ ఒకసారి కసి పుడితే మరుసారి మతి చెడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిలే
అదిరింది పిల్లా అదిరిందిలే కుదిరింది పెళ్లి కుదిరిందిలే ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే వలపు జోరు తేలాలిల
పూలపక్క ముళ్ళలాగ మారుతుంది ఎప్పుడంట కూలుకున్న కౌగిలింత సడలిపోతే తప్పదంట మొదటి రేయి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడంట మూడు నాళ్ళ ముచ్చటంతా డస్సి పొతే గిట్టదంట రేయి రేయి మొదటి రేయి కావాలంటే ఎట్టాగంట సూరీడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంట తొలి రేయి గిలి పుడితే తుది రేయి కలబడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిలే
అదిరింది మామా అదిరిందిరో ముదిరింది ప్రేమ ముదిరిందిరో ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిరో అదిరింది పిల్లా అదిరిందిలే కుదిరింది పెళ్లి కుదిరిందిలే ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే వలపు జోరు తేలాలిలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి