చిత్రం: కోరుకున్న ప్రియుడు (1997 )
సంగీతం: కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు మోగే సన్నాయి తోన సుముహూర్తం చేరిందని తాకే కౌగిళ్లలోన శుభకార్యం కానుందని చందమామే అంది ఎద చంద్రమై పొంగింది ఆ నింగి నేల ఏకం చేసే రాగంలో కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు ఎదురు చూసే ఆషాడమేఘం చెలిమి గల్లే చేరే వేళా పురులు విరిసి తనువు మెరిసే వలపు హరివిల్లుగా ఎదను మీటే కళ్యాణరాగం చిలిపి గీతం పాడే వేళా వదువు ప్రాయం నిదుర లేచే వరద గోదారిలా ముచ్చట తీర్చగ ముందుకు వచ్చిన అనురాగమా వెచ్చని వేడుక ముంగిట వేచిన జతచేరుమా సోయగాల సిరులు సుస్వాగతం అంటుంటే ఆ నింగి నేల ఏకం చేసే ఆనందంలో కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు నిమిషమైనా నిను వీడిపోక నిలిచిపోనా నా శశిరేఖ పగడమంటి పెదవిపైన చలువ చిరునవ్వుగా మనసు నేనే మారాజు వేగ సొగసు రాజ్యం సొంతం కాదా తనివి తీరా అణువు అణువు అందుకో కానుకా ఆశల తోటకి ఆమని తెచ్చిన ఓ మేనకా ప్రతి ఒక రేయి కౌగిలి పున్నమి కావాలిగా కన్నె నాగై నన్ను నువ్వు అల్లుకుంటూ వుంటే ఆ నింగి నేల ఏకం చేసే రాగంలో కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు మోగే సన్నాయి తోన సుముహూర్తం చేరిందని సాగే కౌగిళ్లలోన శుభకార్యం కానుందని చందమామే అంది ఎద చంద్రమై పొంగింది ఆ నింగి నేల ఏకం చేసే ఆనందంలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి