3, ఆగస్టు 2021, మంగళవారం

Sarada Bullodu : Mogindoyammo Sruthi Cheyyani Lyrics (మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ)

చిత్రం:సరదా బుల్లోడు(1996)

సంగీతం: కోటి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి: ఆహా.....హా.... ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన ఏం తాళం వేసాడే ధీంతన ధీంతన ధీంతన ధీంతన ఏం రాగం తీసిందే అంగనా ఆ............ ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన చరణం:1 మోజుకొద్ది ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ రాజుకోదా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన నడుము చుట్టూ ఒక్కో పట్టు కొంప ముంచే వేళ మరిచిపోదా ఒప్పు తప్పు కంచె తెంచే గోల అదిరే పెదవే అదిమి అణిచేదా తాపం కందే అందం చిదిమి వెలిగించు దీపం పొద్దేమిటో హద్దేమిటో మోహం మరిపించే మత్తులో....... ఆ........ ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన చరణం:2 ఆడ ఈడ తేడా లేక వాడి చూపేసాడే ఆడ ఈడే తోడై రాగా వీరుడైపోయాడే ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన దాగలేక సోకుల సైగ వేడి పెంచేసిందే ఆగలేక రేగే దాకా ఏడిపించేసిందే వామ్మో వాయ్యో అన్నా వినలేదే వేగం ఆహా ఊహూ అంటూ కురిసింది తాపం అల్లేసినా గిల్లేసినా బాగానే ఉందే కొత్తగా..... ఆ....... ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన ఏం తాళం వేసాడే ధీంతన ధీంతన ధీంతన ధీంతన ఏం రాగం తీసెందే అంగనా ఆ.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి