చిత్రం: మావిచిగురు (1996)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
పల్లవి:
F : మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా
M : మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా
F : ఇంతలో కలపండగ... ఇంటిలో తొలి పండుగ
M : సింగారి సీతకు శీమంతమై సరికొత్త ఆశల వసంతమై.మనసు మురిసిపోగా
F : మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా
M : మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా
చరణం 1:
F : నీ గుండెలో అనురాగానికి ఒక బొమ్మ గీయనా
M : ఆ బొమ్మలో గల పాపాయికి జోజోలు పాడనా
F : మన కలలకి ఉదయమిదే అని తెలిపిన కిరణమిది
M : అణువణువును కలగలపే మన చెలిమికి సాక్ష్యమిది.
F : మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగ కనబడగా
M : పలికించనీ నవ నాదాలనీ పారాడనీపసి పాదాలనీ.మనసు మురిసిపోగా
F : మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా
M : మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా....
చరణం 2:
M : వయ్యారివూహలు తియ్యంగ ఊదిన వేణునాదమో
F : చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వాన గానమో
M : నీ సిగ్గుల సరిగమలో ఏ కులుకుల గమకమిది
F : నీ ముద్దుల మధురిమలో ఏ మమతల తమకమిది
M : మునుపెరుగని ప్రియలయలో శ్రుతి కలిపిన జత కథలో
F : సంసార వీణను సవరించగా సంతాన గీతిక రవళించగా,మనసు మురిసిపోగా....
M : మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా
F : మంచి కుబురు విని లాలి
గీతిక రవళించగా.మనసు
మురిసిపోగా....
M : మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా
F : మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా
M : ఇంతలో కల పండగా... ఇంటిలో తొలి పండుగా...
F : సింగారి సీతకు శీమంతమై సరికొత్త ఆశల వసంతమై.మనసు మురిసిపోగా....
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా
M : మంచి కుబురు విని లాలి
పదములు ఆలపించెను కొత్త ఊయలా..
F : ఆ....ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి