Maavichiguru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maavichiguru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, డిసెంబర్ 2023, సోమవారం

Maavichiguru : Kommana Kulike Koyila Song Lyrics (కొమ్మన కులికే కోయిల)

చిత్రం: మావిచిగురు (1996)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి




కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే కమ్మగ నవ్వే నెచ్చెలి నీ అందెల సవ్వడి చెయ్యవే ఓ....మామా - ఓ....భామా ఎదలోయల దాగిన చిత్రమా కనుసైగలు చేసిన ఆత్రమా ఉదయాలకు నీవే ప్రాణమా కసి ముద్దులు రాసిన కావ్యమా వయారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే తేనెలు మరిగిన తుమ్మెదా కను చూపుల గారడి చేయకే చరణం: 1 చెప్పేయ్ వా చెవిలోన ఒక మాట పువ్వులతో తుమ్మెద చెప్పేమాట నీ చిరునవ్వు సాక్షిగా తాజ్మహల్ నాదట నీ పెదవంచు సాక్షిగా షాజహాను నేనట నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ అనంతాల ఆర్త నీవై చేరుకున్న వెళ్లలో కొకలు కట్టిన కోయిల ఓ కమ్మని కౌగిలియవే తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడి చేయకే చరణం: 2 పూసింది కౌగిట్లో పులకింత వెచ్చంగా పాకింది ఒళ్ళంతా పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన నీ మెడలోని తాళినై నూరేళ్లు దాగన నీ చెంతకు చేరా విరహంతో పడలేక నును మెత్తని పరువం రాసింది శుభలేఖ సరగాల సాగరాన స్వాతిచినుకై సోలిపో కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే తేనెలు మరిగిన తుమ్మెదా నీ అల్లరి పనులిక ఆపవే ఓ....భామ - ఓ....మామ ఉదయాలకు నీవే ప్రాణమా కసి ముద్దులు రాసిన కావ్యమా ఎదలోయల దాగిన చిత్రమా కనుసైగలు చేసిన ఆత్రమా వయారాల వీణ నీవై దోచుకున్న అందమా కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే కమ్మగ నవ్వే నెచ్చెలి నీ అందెల సవ్వడి చెయ్యవే



11, డిసెంబర్ 2023, సోమవారం

Maavichiguru : Kondamalli Kondaamalli Song Lyrics (కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే)

చిత్రం: మావిచిగురు (1996)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి



అతను:  కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే ఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే అతను: చిరు నవవుల దోరసాని చిరు గజుల సడియేమి ఆమె: యెదలోయల కదలాడే తొలి ఆశల సడి స్వామి అతను: అసలన్నీ ఊసులాయే ఆమె: గుండెచేరే గువ్వాలే అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే ఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే అతను: చుక్కల్లూ మెరిసెవేల చెలి చెక్కిళ్లు ముద్దాడనా ఆమె : వెన్నల్లు కురిసేవేల నిను వాడిచేర్చి లాలించానా అతను: కౌగిల్లా పందిట్లో జాత చెరవా పరువాల పొంగులో తేలించావా ఆమె : కల్యాణ రాగలు వినిపించని కళ్ళలో నీ రూపు కనిపించని అతను: ఈ చలిలో నీ ఒడిలో ఆమె : ఈ ఆరాటం పోరాటం ప్రతి ప్రేమ కథలోదే అతను: తోడుకోరీ ఈడు బాధ చుడలేవా చిట్టి రాధ కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే ఆమె : నీ కల్లా వాకిల్లో పెళ్లి పల్లాకి నేనెక్కనా అతను: లెలేతా నాడువోంపులో నీ అందం తిలకించనా ఆమె : జాడ పట్టి నీలబెట్టి కవ్విన్చాకు జాతా కట్టి నాను చుట్టి బందిన్చాకు అతను: నిను మేచి నీ కొసామోచానులే కడదాకా నిన్నింకా వీడబోనులే ఆమె : ఓకాటయే సమయనా అతను: ఈ ఆనందమ్ అనుబంధం ఏ జన్మా వరమో ఆమె : అల్లుకుందియీ వల్లేవటు చేరమంది చెట్టుచాటు అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే ఆమె : కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే అతను: చిరు నవవుల దోరసాని చిరు గజుల సడియేమి ఆమె : యెదలోయల కదలాడే తొలి ఆశల సడి స్వామి అతను: అసలన్నీ ఊసులాయే ఆమె : గుండెచేరే గువ్వాలే కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

26, డిసెంబర్ 2021, ఆదివారం

Maavichiguru : Kodanda raamudanta song lyrics (కోదండ రాముడంటే)

చిత్రం: మావిచిగురు (1996 )

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


కోదండ రాముడంటే కొమ్మలాలా వాడు కౌసల్య కొమరుదంతా కొమ్మలాలా
ఆజాను బాహుదంతా అమ్మలాలా వాడు అరవింద నేత్రుడంత అమ్మలాలా రామణీల లామెకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
ఈడు జోడు బాగానే ఉంటుందండీ చూసయిగానే లగ్గాలే పెట్టించండి
ఏదీ ఇంకా అందాకా రాణీ రాణీ పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ
బాడీ మాత్రం భేషుగ్గా కనపడుతోంది టైర్-లు మాత్రం రిటైర్ అయిపోయాయండీ
అడపా దాదాపా గాలి కొడితే సరిపోతుంది మారుతి లాగా మాబుల్లో పరుగెడుతోంది
వట్టనారు వట్టనారు అయ్ బాబోయ్ వచ్చేట్టనారండోయ్ దొంగలో బందిపోటులో వస్తున్నట్టు ఆ గావు కేకలు ఏమిట్రా
వచ్చేది పెళ్లి వారీగా! బాగుండయ్యోయ్ ముసలాయన వచ్చేది మెగా పెళ్ళివారు! కబుర్లాడుతూ కూర్చోకా
ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురేళ్ళు అన్ని యార్పాట్లు చేసానే ముసలీ అయినా ఏది ఇంకా రాందే

ఆ వచ్చామండీ మొత్తానికి వచ్చామండీ తెచ్చామండీ అబ్బాయిని తెచ్చామండీ కార్-యూ పల్లకి మాక్కూడా తెచ్చామండీ పిల్లనంపితే తీసుకునే వెళతామండీ
అబ్బాయ్ మనం పెళ్ళికి రాలేదు. పెళ్లి చూపులకి వచ్చాము నువ్వలా తొందర పడకూ. రండయ్యా రండి పెళ్లి పెద్దల్లారా అన్నీ సిద్దంగా ఉంచాం వచ్చి చూసుకోరా కాఫీ ఫలహారాలవి కానిస్తారా, లేక అర్జెంటుగా అమ్మాయిని చూసేస్తారా
బాబాయ్, కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు అమ్మాయిని పిలిపించండీ వధువు వస్తున్నది
వధువు కాదు, అదేదో వింత వస్తువు. బాబాయ్ నీ పేస్ అలా సైడుకి పెట్టి అమ్మాయిని తీసుకు రండీ వధువు వస్తున్నది
కొంచెం అగెద్ గా ఉన్నట్టుండీ నీ మొహం ఆవిడ మా పిన్ని. పిన్నీ ఆలస్యం చేస్తే మావాడు ఆడ వాళ్ళు అందర్నీ పెళ్లికూతుర్లు
అనుకునేట్లున్నాడు అసలు హీరోయిన్ ని తీసుకురండమ్మా వధువు వస్తున్నది
అబ్బాయ్, వాయిదాలు వేయకుండా జుద్గ్మెంత్ ఇచ్చేయ్ అమ్మాయి నచ్చిందా? ఒకే. నచ్చినట్టేనండీ
నసాగకూ, ఎం కావాలో అడుగు పాత ఏమైనా వచ్చునేమో కనుక్కోండి గురువుగారూ
హహహ పాత ఆటమ్మా పాడేస్తే పోలా
కోదండ రాముడంటే కొమ్మలాలా వాడు కౌసల్య కొమరుదంతా కొమ్మలాలా
ఆజాను బాహుదంతా అమ్మలాలా వాడు అరవింద నేత్రుడంత అమ్మలాలా  రామణీల లామెకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ డివ్వి డివ్వి డివ్విత్తం తెచ్చిందండీ సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ డివ్వి డివ్వి డివ్విత్తం తెచ్చిందండీ
రేపోమాపో పప్పన్నం పెడతామండీ ఊరు వాడా జనమంతా దీవించండి



14, ఆగస్టు 2021, శనివారం

Maavichiguru : Maata Ivvama Chelli Song Lyrics (మాట ఇవ్వమ్మా చెల్లీ )

చిత్రం: మావిచిగురు (1996 )

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర



మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా కన్న బిడ్డకన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడూ ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా వెర్రి నాయనా అటువంటి మారాజుకీ తగు జంట అవుతాననీ త్వరలోనె నా ఊసునీ మరపింప చేస్తాననీ మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనకా వస్తాను త్వరలోనె మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమా ఎంత పొందినా తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మా ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై వచ్చేది నేనేననీ గుర్తుంచుకుంటాననీ ఆ కొత్త జన్మానికీ నా పేరె పెడతాననీ మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి