చిత్రం: మహారాజు (1986)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల
కైలాస శిఖరాన కొలువైన స్వామీ నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ మనసున్న మంచోల్లే మహారాజులూ మమతన్టూ లేనొళ్ళె నిరుపేదలూ ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమీ అనుకుంటే నీకేమి లే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా
చరణం 1: కన్నీటా తడిసినా కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమకన్నా నిధులు లేవు నీ కన్న ఎవరయ్యా మారాజులు నిన్నెవరూ ఏమన్నా నీ దాసూలూ జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగినవి జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా
చరణం 2: త్యాగాల జీవితం తనవారికన్కితమ్ మిగిలింది నీ నేను నా నువ్వెలే దేవుడు వంటీ భర్త ఉంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి