చిత్రం: మావిచిగురు (1996)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె.యస్.చిత్ర
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
పల్లవి:
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
చరణం 1:
పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా
కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా
కన్న బిడ్డకన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ
పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడూ
ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా వెర్రి నాయనా
అటువంటి మారాజుకీ తగు జంట అవుతాననీ
త్వరలోనె నా ఊసునీ మరపింప చేస్తాననీ
మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
చరణం 2:
ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనకా వస్తాను త్వరలోనె మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమా ఎంత పొందినా తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మా ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై వచ్చేది నేనేననీ గుర్తుంచుకుంటాననీ ఆ కొత్త జన్మానికీ నా పేరె పెడతాననీ మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి