17, ఆగస్టు 2021, మంగళవారం

Matru Devo Bhava : Raalipoye Puvva Song Lyrics (రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..)

చిత్రం : మాతృ దేవో భవ (1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం:  ఎం. ఎం. కీరవాణి


రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో..చీకటాయెలే.. నీకిది తెల్లవారని రేయమ్మా.. కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం.

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. చెదిరింది నీ గూడు గాలిగా.. చిలక గోరింకమ్మ గాధగా.. చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.. తనవాడు తారల్లో చేరగా.. మనసు మాంగల్యాలు జారగా.. సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా.. తిరిగే భూమాతవు నీవై.. వేకువ లో వెన్నెలవై.. కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హారతివై..

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. అనుబంధమంటేనే అప్పులే.. కరిగే బంధాలన్నీ మబ్బులే.. హేమంత రాగాల చేమంతులే వాడిపోయే.. తన రంగు మార్చింది రక్తమే.. తనతో రాలేనంది పాశమే.. దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే.. పగిలే ఆకాశం నీవై.. జారిపడే..జాబిలివై.. మిగిలే ఆలాపన నీవై.. తీగ తెగే..వీణియవై..(రాలిపోయే)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి