Matru Devo Bhava లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Matru Devo Bhava లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2021, మంగళవారం

Matru Devo Bhava : Kannetiki Kaalavalu Song Lyrics (కన్నీటికి కలువలు పూసేనా.. )

చిత్రం : మాతృ దేవో భవ (1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా.. విధి శోధన ఆగెనా... కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... తనువే గాయాల గానమురళీ.. ఐనా మది మౌనరాగ రవళి ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే ఫించాలు విప్పె నెమలి పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా.. ఎదగోలలు ఆగేనా.. కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మృతిలో తలదాచుకున్న బ్రతుకు శ్రుతిలో కలిపింది నిన్ను జతకు గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పొరాడు జంటకొరకు పొద్ధులెన్ని ఉదయించిన రేపటి చీకటి తీరేనా ఎడబాటిక ఇంతేనా.. కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా.. విధి శోధన ఆగెనా...

Matru Devo Bhava : Raagam Anuraagam Song Lyrics (రాగం అనురాగం..సంసారం..మ్మ్)

చిత్రం : మాతృ దేవో భవ (1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి:- రాగం అనురాగం..సంసారం..మ్మ్  బంధం అనుబంధం..సంగీతం..మ్మ్  ఇద్దరుంటే పంచదార..సాగరం ఇల్లు చూస్తే మల్లె పూల పంజరం..అహహా..ఆ  రాగం అనురాగం సంసారం..బంధం అనుబంధం సంగీతం  చరణం:-1 గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ ఏంటో చెప్పమ్మా..తేలు  పగలేమో రెండే కాళ్ళు చీకటి పడితే నాలుగు కాళ్ళు జంతువు కాదు మనిషే..ఎవరు..?ఇంకెవరు నాన్నే..ఏయ్ చిరు చిరు నవ్వుల్లో చిన్నారి గువ్వల్లో..చీకటింట దీపమెట్టాలా కనులు అదిరేలా..హా..కలలు కనవేలా  ముసి ముసి ముద్దుల్లొ ముక్కుతున్న పొద్దుల్లో వెన్నెలింట వేడే పుట్టాలా పెదవి వెనకాలా హా..మధువులొలకాలా ఒడిలో పాప బడిలో పాప జతకీ కంటి పాపా యెదలో పాప యెదుటే పాప చెలి నా పాప చెలాకి సొగసుల రాగం అనురాగం సంసారం..మ్మ్..బంధం అనుబంధం సంగీతం..మ్మ్ చరణం:-2 రాతిరి చేసిన తప్పుల్ని పొద్దుట మన్నించేస్తుంది ఎన్ని సార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది ఆ దేవతెవరు? కనకదుర్గమ్మ..కాదు పోలేరమ్మా..కాదు..మరియమ్మా..కాదమ్మా..మీ అమ్మ తొలకరి తోటల్లొ వాగుల్లో వంకల్లో ఎంకి పాట ఏకం అవ్వాలా మనసు కవి పాటా..హ..మనకు విరిబాటా తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో ఏడు జన్మలేకం అవ్వాలా తెలుగు హరి పాటా..హ..తేనియల తేటా  చిరు కోపాల చెలి రూపాలు పరిచే పక్కపాలు  తమ తాపాల కసి దూపాలు అపుడే కాదు పదండి అనగల రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం

Matru Devo Bhava : Venuvai Vachanu Song Lyrics ( వేణువై వచ్చాను భువనానికి )

చిత్రం : మాతృ దేవో భవ (1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం:  కె.యస్.చిత్ర


వేణువై వచ్చాను వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!

హరీ! హరీ! హరీ!

రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ! రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

Matru Devo Bhava : Raalipoye Puvva Song Lyrics (రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..)

చిత్రం : మాతృ దేవో భవ (1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం:  ఎం. ఎం. కీరవాణి


రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో..చీకటాయెలే.. నీకిది తెల్లవారని రేయమ్మా.. కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం.

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. చెదిరింది నీ గూడు గాలిగా.. చిలక గోరింకమ్మ గాధగా.. చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.. తనవాడు తారల్లో చేరగా.. మనసు మాంగల్యాలు జారగా.. సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా.. తిరిగే భూమాతవు నీవై.. వేకువ లో వెన్నెలవై.. కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హారతివై..

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. అనుబంధమంటేనే అప్పులే.. కరిగే బంధాలన్నీ మబ్బులే.. హేమంత రాగాల చేమంతులే వాడిపోయే.. తన రంగు మార్చింది రక్తమే.. తనతో రాలేనంది పాశమే.. దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే.. పగిలే ఆకాశం నీవై.. జారిపడే..జాబిలివై.. మిగిలే ఆలాపన నీవై.. తీగ తెగే..వీణియవై..(రాలిపోయే)