చిత్రం : ముద్దుల ప్రియుడు (1994)
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కీరవాణి
నాకే గనక నీతోనే గనక పెళ్ళైతె గనక త త త తర్వాత ఏమి చెయ్యాలి క క క కామున్ని కాస్త అడగాలి ఆహా ఓహో అంటూ ఉంటే వింటున్న వాళ్ళు వేడెక్కిపోవాలి నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక త త త తర్వాత ఏమి చెయ్యాలి క క క కామున్ని కాస్త అడగాలి నచ్చావు గనక ముచ్చటైన ముద్దుల్ని పెట్టి మోమాట పెట్టి నిలువెల్లా చుట్టి కౌగిళ్ళు కట్టి మురిపాలు చెల్లించనా వచ్చావు గనక వన్నెలన్నీ ఒళ్ళోన పెట్టి నైవేద్యమెట్టి సిగ్గుల్ని చుట్టి చిలకల్ని కట్టి తాంబూలమందించనా పెదవిలోని పాఠాలు చదువుకోనా ఈనాడు అదుపులేని అందాలన్ని అడిగినాయి నీ తోడు తప్పో ఒప్పో తప్పేదెట్టా తెగించకుంటే తగ్గదు మంట మాయ మనసు మాట వినదు కదా నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక త త త తర్వాత ఏమి చెయ్యాలి క క క కామున్ని కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా మొ మొ మొ మోజుల మోత మోగాలి గ గ గ గాజుల గోల పెరగాలి మోమాట పడక కొద్దిసేపు ఓపిక పట్టి వీపున తట్టి గిలిగింత పెట్టి బలవంత పెట్టి జరపాలి జత పండగ వద్దన్నా వినక ఒక్కసారి చల్లంగ నవ్వి మెల్లంగ దువ్వి లయలెన్నో వేసి చొరవేదో చేసి బరువంతా దించేయనా తనువు నీకు తాకించి ఋణము తీర్చుకుంటాలే తనివి తీరిపోయే దాక తపన దించుకుంటాలే ఎగాదిగా వేగే సోకే తాకావంటే జోహారు అంటా ఒళ్ళు నీకు విల్లు రాసి ఇస్తా అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా మొ మొ మొ మోజుల మోత మోగాలి గ గ గ గాజుల గోల పెరగాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి