చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం రచన: మల్లెమాల సుందర రామిరెడ్డిగాయని: సుశీల
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడింది.. సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడింది.. హా హ హా..ఆ హ హా.. గున్నమావికి సన్నజాజికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.. గున్నమావికి సన్నజాజికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.. ఆహా ఆహా..ఓహో..ఒహో.. పూసే..వసంతాలు మాకళ్ళలో.. పూసే..తలంబ్రాలు మా పెళ్ళిలో.. పూసే..వసంతాలు మాకళ్ళలో.. పూసే..తలంబ్రాలు మా పెళ్ళిలో.. విరికొమ్మా..చిరురెమ్మా. విరికొమ్మా..చిరురెమ్మా. పేరంటానికి రారమ్మా సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడిందీ.. హా హ హా..ఆ హ హా.. కలలే..నిజలయే ఈనాటికీ.. అలలే..స్వరాలాయే మా పాటకీ కలలే..నిజలయే ఈనాటికీ.. అలలే..స్వరాలాయే మా పాటకీ శ్రీరస్తూ..శుభమస్తూ.. శ్రీరస్తూ..శుభమస్తూ.. అని మీరు మీరు దీవించాలి.. సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.. సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి