9, ఆగస్టు 2021, సోమవారం

Mutyala Muggu : Entati Rasikudavo Song Lyrics (ఎంతటి రసికుడవో తెలిసెరా)


చిత్రం : ముత్యాల ముగ్గు (1975) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : కె.వి.మహదేవన్ గానం : పి.సుశీల



పల్లవి : ఎంతటి రసికుడవో తెలిసెరా నీవెంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా...(2) ఎంతటి రసికుడవో తెలిసెరా చరణం : గుత్తపు రవిక ఓయమ్మో చెమట చిత్తడిలో తడిసి ఉండగా(2) ఎంతసేపు నీ తుంటరి చూపు(౩) అంతలోనే తిరుగాడుచుండగా చరణం : మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా(2) టక్కున కౌగిట చిక్కబట్టి నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా


ఎంతటి రసికుడవో తెలిసెరా నీవెంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా... ఎంతటి రసికుడవో తెలిసెరా తెలిసెరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి