Mutyala Muggu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mutyala Muggu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2024, సోమవారం

Mutyala Muggu : Mutyamanta Pasupu Song Lyrics (ముత్యమంతా పసుపు )

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

రచన : ఆరుద్ర

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి. సుశీల



ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1: ఆరనయిదో తనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేతనుండు ఆరనయిదో తనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేతనుండు తీరైన సంపదా ఎవరింట నుండు.. తీరైన సంపదా ఎవరింట నుండు... దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 2: కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కొలిచేవారి కొంగు బంగారూ.. కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కొలిచేవారి కొంగు బంగారూ.. గోవు మాలక్ష్మికి కోటి దండాలు.. గోవు మాలక్ష్మికి కోటి దండాలు.. కోరినంత పాడి నిండు కడవళ్ళూ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 3: మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంత వైభోగం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ


Mutyala Muggu : Edo Edo Annadi Song Lyrics (ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు )

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

రచన : డా॥సి.నారాయణరెడ్డి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : రామకృష్ణ



ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే ఒయ్యారం ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి... ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు... ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

Mutyala Muggu : Nidurinche Totaloki Song Lyrics (నిదురించే తోటలోకి )

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

రచన : గుంటూరు శేషేంద్ర శర్మ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి. సుశీల




నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బుల్లారా నది దోచుకుపోతున్న నావను ఆపండి రేవు బావురుమంటుందని నావకు చెప్పండి నావకు చెప్పండి

Mutyala Muggu : Gogulu Pooche Gogulu Kache Song Lyrics (గోగులు పూచే.గోగులు)

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల





గోగులు పూచే.గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి గోగులు పూచే.గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి.ఈ.ఈ ఓ లచ్చ గుమ్మాడి పొద్దు పొడిచే పొద్దు పొడిచే.ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే.ఓ లచ్చా గుమ్మాడి పొద్దు పొడిచే పొద్దు పొడిచే.ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే.ఓ లచ్చా గుమ్మాడి పొద్దు కాదది. నీ.ఈ.ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే.ఏ.సుమా.ఆ పొద్దు కా.ఆ.దది. నీ.ఈ.ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే.ఏ.సుమా.ఆ వెలుగులు కావవి.నీ పాదాలకు అలదిన పారాణీ. ఆహ. హ.జిలుగులే సుమా.ఆ.ఆ ముంగిట వేసిన ముగ్గులు చూడు .ఓ లచ్చా గుమ్మాడి ముత్యాలా ముగ్గులు చూడు .ఓ లచ్చా గుమ్మాడి ముంగిట వేసిన ముగ్గులు చూడు .ఓ లచ్చా గుమ్మాడి ముత్యాలా ముగ్గులు చూడు .ఓ లచ్చా గుమ్మాడి ముంగిలి కాదది.నీ అడుగులలో పొంగిన పా.ల కడలియే సుమా.ఆ ముంగిలి కాదది.నీ అడుగులలో పొంగిన పా.ల కడలియే సుమా.ఆ ముగ్గులు కావవి.నా అంతరంగాన పూచిన రంగవల్లులే.ఏ.ఏ.సుమా.ఆ.ఆ మల్లెలు పూచే మల్లెలు పూచే .ఓ లచ్చా గుమ్మాడి వెన్నెల కాచే వెన్నెల కాచే .ఓ లచ్చా గుమ్మాడి. మల్లెలు పూచే మల్లెలు పూచే .ఓ లచ్చా గుమ్మాడి వెన్నెల కాచే వెన్నెల కాచే .ఓ లచ్చా గుమ్మాడి. మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే.ఏ.ఏ. సుమా.ఆ.ఆ మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే.ఏ.ఏ. సుమా.ఆ.ఆ వెన్నెల కాదది వేళ తెలిసి.ఆ జాబిలి వేసిన పానుపే.ఏ.ఏ.ఏ. సుమా.ఆ.ఆ.ఆ

9, ఆగస్టు 2021, సోమవారం

Mutyala Muggu : Entati Rasikudavo Song Lyrics (ఎంతటి రసికుడవో తెలిసెరా)


చిత్రం : ముత్యాల ముగ్గు (1975) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : కె.వి.మహదేవన్ గానం : పి.సుశీల



పల్లవి : ఎంతటి రసికుడవో తెలిసెరా నీవెంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా...(2) ఎంతటి రసికుడవో తెలిసెరా చరణం : గుత్తపు రవిక ఓయమ్మో చెమట చిత్తడిలో తడిసి ఉండగా(2) ఎంతసేపు నీ తుంటరి చూపు(౩) అంతలోనే తిరుగాడుచుండగా చరణం : మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా(2) టక్కున కౌగిట చిక్కబట్టి నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా


ఎంతటి రసికుడవో తెలిసెరా నీవెంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా... ఎంతటి రసికుడవో తెలిసెరా తెలిసెరా