6, ఆగస్టు 2021, శుక్రవారం

Nacchavule : Ninne Ninne Kora Song Lyrics (నిన్నే నిన్నే కోరా..)

 

చిత్రం:- నచ్చావులే(2008)

సాహిత్యం:- భాస్కరభట్ల రవికుమార్

గానం:- గీతా మాధురి

సంగీతం:- శేఖర్ చంద్ర




నిన్నే నిన్నే కోరా.. నిన్నే నిన్నే చేరా.. నిరంతరం నీ ధ్యానం లో..నన్నే మరిచా.. నిన్నే నిన్నే కోరా.. నిన్నే నిన్నే చేరా.. నిరంతరం నీ ధ్యానం లో..నన్నే మరిచా.. ప్రతీ జన్మలోనా.. నీతో ప్రేమలోనా.. ఇలా ఉండిపోనా.. ఓ ప్రియతమా.. నచ్చావే.. నచ్చావే.. ఓ నచ్చావే.. నచ్చావులే.. అనుకుని అనుకోగానే..సరాసరి ఎదురౌతావు.. వేరె పనేం లేదా నీకు..నన్నె వదలవూ.. ఊ.. నువ్వు నాకు ఎందుకింత.. ఇష్టమంటే చెప్పలేను.. మరువలేనే నిన్ను నేను.. గుర్థురానే నాకు నేను.. నీ మైకం కమ్ముకుంది.. ఈరోజే నన్నిలా.. ఏలోకం కొత్తగుంది.. సీతాకోకలాగా.. నిన్నే నిన్నే కోరా.. నిన్నే నిన్నే చేరా.. నిరంతరం నీ ధ్యానం లో..నన్నే మరిచా.. నీతో ఏదో చెప్పాలంటూ.. పదే పదే అనిపిస్తుంది.. పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నదీ.. ఓ.. మనసునేమో దాచమన్నా.. అస్సలేమి దాచుకోదు.. నిన్ను చుస్తే పొద్దు పోదు.. చూడకుంటే ఊసు పోదు.. ఈ వైనం ఇంత కాలం.. నా లోనే లేదుగా.. నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా.. నిన్నే నిన్నే కోరా.. నిన్నే నిన్నే చేరా.. నిరంతరం నీ ధ్యానం లో..నన్నే మరిచా.. ప్రతీ జన్మలోనా.. నీతో ప్రేమలోనా.. ఇలా ఉండిపోనా.. ఓ ప్రియతమా.. నచ్చావే.. నచ్చావే.. ఓ నచ్చావే.. నచ్చావులే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి