6, ఆగస్టు 2021, శుక్రవారం

Alluri Seetharama Raju : Vastadu Naaraju Song Lyrics (వస్తాడు నా రాజు ఈ రోజు )

చిత్రం:- అల్లూరి సీతారామ రాజు(1974)

సాహిత్యం:- సి.నా.రే.

గానం:- పి.సుశీల

సంగీతం:- పి. ఆదినారాయణరావు




వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను అతని పావన పాద ధూళికై అవని అణువణువు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించెను.. పాలసంద్రమై పరవశించెను వస్తాడు నా రాజు ఈ రోజు రానె వస్తాడు నెలరాజు ఈరోజు వెన్నెలలే○తగా విరిసినగాని చంద్రుని విడిపోలేవు కెరటాలే○తగా పొంగినగాని కడలిని విడిపోలేవు కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే తనువులు వేరైనా దారులు వేరైనా తనువులు వేరైనా దారులు వేరైనా ఆ బంధాలే నిలిచెనులే ఆ బంధాలే నిలిచెనులే వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈ రోజు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి