చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గూడ అంజయ్య
గానం:వందేమాతరం శ్రీనివాస్
లచ్చులో లచ్చన్నా... ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే ఎయ్... అరెరరె లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఏయ్... అ ఏకనోడు పీకనోడు జనం మొఖం దేఖనోడు జనం మొఖం దేఖనోడు ఎలక్షన్ల జీబులొచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి కాలవి గట్టిచ్చినమని కానూను బలుకుతున్రు కానూను బలుకుతున్రు కోళ్లగూడు కొంపగట్టి కోట్లు మింగి కూర్చున్రు కోట్లు మింగి కూర్చున్రు దసరా పండగొచ్చిందని రాక రాక అల్లుడొస్తే రాక రాక అల్లుడొస్తే ఆలుమగలు ఇద్దరింట మసలరాదు మెసలరాదు మసలరాదు మెసలరాదు ఉచ్చబొయ్యబోదమంటే... ఉచ్చబొయ్యబోదమంటే పంచ పొంటిదాగుండదు లచ్చులో... లచ్చులో... లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ప్రజలవద్ద పాలనని ఊరూరుకి తిరుగుతున్రు ఊరూరుకి తిరుగుతున్రు ఎన్నడు రానాఫీసరు గుడిసె ముందుకొచ్చిన్రు గుడిసె ముందుకొచ్చిన్రు కడుపులో సల్ల కదలకుండ కారు మీద వచ్చిన్రు కారు మీద వచ్చిన్రు శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిన్రు పలుగు పార పట్టిన్రు అంగిస్తరి చడకుండా తట్ట నెత్తికెత్తుతున్రు తట్ట నెత్తికెక్కుతున్రు పేపర్లో ఫొటోలకీ... పేపర్లో ఫొటోలకి ఫోజులిచ్చి దిగుతున్రు లచ్చులో... లచ్చులో... లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా అరెరరెరరె... అరె చచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నమని వచ్చిందే కట్నమని సందట్లో సడేమియా సందులోకి జారుతున్రు సందులోకి జారుతున్రు హర్షాదు బోఫార్స్ హవాలా దొంగలు హవాలా దొంగలు సూటు బూటులేసుకున్న సూటికేసు దొంగలు సూటికేసు దొంగలు సంచి కూడ చూపించని యూరియా దొంగలు యూరియా దొంగలు అందరు శకాహారులే... అందరు శకాహారులే రొయ్యల ముల్లేడబాయే లచ్చులో... లచ్చులో... హే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఏయ్... తప్పతాగి నా మొగుడు తన్నుడు గుద్దుడువెడితే తన్నుడు గుద్దుడువెడితే సంసారం ఈదలేక రోజు చచ్చి పుడుతుంటే రోజు చచ్చి పుడుతుంటే అమ్మలక్క లంత గలిసి వాడ వాడ లొల్లి జేసి వాడ వాడ లొల్లి జేసి సర్కారుల గళ్ళవట్టి సార బందు పెట్టిస్తే ఖజానాలు ఖాలీ అని జీతమివ్వలేమని జీతమివ్వలేమని శ్వేతపత్రమట్టుకోని శ్వేతపత్రమట్టుకోని గల్లి గల్లి తిరిగుతన్రు లచ్చులో... లచ్చులో... హే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో... ఒరేయ్ లచ్చులో అన్నో లచ్చులో లచ్చన్నా లచ్చులో లచ్చన్నా లచ్చులో లచ్చన్నా లచ్చులో లచ్చన్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి